ఎస్ఈసీగా సాహ్నీ నియామకంపై వేసిన పిటిషన్ విత్ డ్రా

ABN , First Publish Date - 2021-06-24T18:12:49+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ

ఎస్ఈసీగా సాహ్నీ నియామకంపై వేసిన పిటిషన్ విత్ డ్రా

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌లో పూర్తి పత్రాలు లేనందున పిటిషనర్ మూర్తి ఉపసంహరించుకున్నారు. గురువారం నాడు జరిగిన విచారణలో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు. పూర్తి పత్రాలతో మరోసారి వ్యాజ్యం దాఖలుకు పిటిషనర్ అనుమతి కోరగా.. ఇందుకు హైకోర్టు అంగీకరించింది. దీంతో పిటిషన్ డిస్పోజ్ చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.


కాగా.. ఇప్పటికే ఎస్‌ఈసీగా నీలంను కొనసాగించడాన్ని చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పలువురు పిటిషన్‌‌లు వేసిన విషయం విదితమే. అంతేకాదు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అర్థం చేసుకోకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా సాహ్ని రూ.160 కోట్లు వృథా చేశారని, ఆ సొమ్మును ఆమె నుంచి రాబట్టాలని కూడా కోర్టులను కోరడం జరిగింది. మరోవైపు.. సాహ్ని కొనసాగింపునకు సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై విచారణను ఈ నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-06-24T18:12:49+05:30 IST