ఏఎన్‌ఎంల సమస్యలపై వినతి

ABN , First Publish Date - 2022-08-10T05:19:15+05:30 IST

రేషన్‌లైజేషన్‌ పేరుతో ఏఎన్‌ఎంలను కౌ న్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేసే విధానాన్ని రద్దు చేసేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని మంగళవారం ఒంగోలులో ఏపీఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావును ఏఎన్‌ఎం సంఘ సభ్యులు కలిసి విజ్ఞప్తి చేశారు.

ఏఎన్‌ఎంల సమస్యలపై వినతి

 ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 9: రేషన్‌లైజేషన్‌ పేరుతో ఏఎన్‌ఎంలను కౌ న్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేసే విధానాన్ని రద్దు చేసేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని మంగళవారం ఒంగోలులో ఏపీఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావును ఏఎన్‌ఎం సంఘ సభ్యులు కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్‌జీ వో సంఘం జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్‌బాబు నేతృత్వంలో ఏఎన్‌ఎంలు శ్రీనివాసరావును కలిసి సమస్యలను వివరించారు. ఏఎన్‌ఎంలు ప్రస్తుత  కౌ న్సెలింగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా సమస్య ఉందని, అందువల్ల ఈ విషయాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన ఆయన ఈ విషయంపై ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌తో చర్చించామని తెలిపారు. ఏఎన్‌ఎంలకు అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో పలు వురు ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T05:19:15+05:30 IST