పేట కాంగ్రె్‌సలో వర్గపోరు

ABN , First Publish Date - 2022-01-25T06:41:56+05:30 IST

సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రె్‌సలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డికి పొసగడం లేదు. ఎ వరికి వారుగా పార్టీ సభ్యత్వా ల నమోదు కార్యక్రమంలో పా ల్గొంటున్నారు. కార్యకర్త లు రెండుగా చీలడంతో సీనియర్‌ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పేట కాంగ్రె్‌సలో వర్గపోరు

ఎవరికి వారుగా సభ్యత్వాల నమోదు 

ముందస్తు వార్తలతో టికెట్‌పై చర్చ


(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట) : సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రె్‌సలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డికి పొసగడం లేదు. ఎ వరికి వారుగా పార్టీ సభ్యత్వా ల నమోదు కార్యక్రమంలో పా ల్గొంటున్నారు. కార్యకర్త లు రెండుగా చీలడంతో సీనియర్‌ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రె్‌సలో రెండు వర్గాలు ఉండటంతో టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న అసంతృప్తులు ఏ వర్గంలో చేరాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. వచ్చే అసెం బ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఎవరికి లభిస్తుందో తెలియక చాలా మంది స్తబ్ధుగా ఉన్నారు. టికె ట్‌ ఎవరికి లభిస్తే వారి వెంట వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలే భిన్నంగా ఉంటాయి. అధిష్ఠానం ఎవరికి టికెట్‌ కేటాయిస్తుందో చివరి వరకు టెన్షన్‌ ఉంటుంది. రాత్రికి రాత్రే అభ్యర్థులు మారిపోతుంటారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమే్‌షరెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశించగా చివరికి దామోదర్‌రెడ్డికే అధిష్ఠానం టికెట్‌ కేటాయించింది. ఆ ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య సమన్వయం ఏర్పడినా ఫలితం దక్కలేదు. మంత్రి జగదీ్‌షరెడ్డి సుమారు ఆరు వేల మెజార్టీతో విజయం సాధించారు. అనంతర పరిణామాల్లో కొద్ది నెలలుగా కాంగ్రె్‌సలో రెండు వర్గాలు ఎవరికి వారే యమునా తీరులా వ్యవహరిస్తున్నాయి. నియోజకవర్గంలో సూర్యాపేట పట్టణం, సూర్యాపేట రూరల్‌, చివ్వెంల, ఆత్మకూర్‌(ఎ్‌స),పెన్‌పహాడ్‌ మం డలాలు ఉన్నాయి. మొత్తం 1,87, 657మంది ఓటర్లు ఉన్నారు. అందు లో 94,495 మంది మహిళ లు, 93,153 మంది పురుషులు ఉన్నారు. పే ట పట్టణంలోనే 50వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి అభ్యర్థుల గెలుపు లో పట్టణ ఓటర్లే కీలకం. కేవలం పట్టణంలోనే ఆధి క్యం రావడంతోనే మంత్రి జగదీ్‌షరెడ్డి అప్పట్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీకి నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో గట్టిపట్టు ఉంది. పార్టీ సంస్థాగతంగా బలంగానే ఉన్నా వర్గపోరు విఘాతంగా మారింది.


టికెట్‌ ఎవరికో?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పేట నియోజకవర్గ అసెంబ్లీ టికెట్‌ అధిష్ఠానం ఎవరికి కేటాయిస్తుందనేది ప్రస్తుతం చర్చగా మారింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఉహాగానాల నేపథ్యంలో ఇరువురు నాయకులు అధిష్ఠానం మెప్పుకోసం యత్నిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకంతో పటేల్‌రమే్‌షరెడ్డి వర్గీయుల్లో నమ్మ కం పెరిగింది. ఈసారి రమే్‌షరెడ్డికే టికెట్‌ దక్కుతుందని ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. అయితే పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా రాంరెడ్డి దామోదర్‌రెడ్డి బాధ్యత లు నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీలో సీనియర్లకు ప్రాధా న్యం ఉంటుందనే విషయం అధిష్ఠానం చెప్పకనే చెప్పిం ది. మొత్తం మీద టికెట్‌పై కాంగ్రె్‌సలో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఇరువురు నేతలు డిజిటల్‌ లింకులు తెచ్చుకొని సభ్యత్వాలు నమోదుచేయిస్తున్నారు. పాతరం నాయకులు దామోదర్‌రెడ్డికి మద్దతు తెలుపుతుండగా, కొత్త తరం రమే్‌షరెడ్డికి మద్దతు తెలుపుతోంది. కాంగ్రె్‌సలో బీసీలకు ఇప్పటి వరకు నియోజకవర్గ టికెట్‌ కేటాయించలేదు. వచ్చే ఎన్నికల్లో అయినా బీసీలకు టికెట్‌ కేటాయించాలని ఓబీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తండు శ్రీనివా్‌సయాదవ్‌ కోరుతున్నారు. మొత్తానికి చివరి నిమిషంలో ఎవరికి టికెట్‌ దక్కుతుందో వేచి చూడాల్సిందే.


పోటాపోటీగా సభ్యత్వాల నమోదు

కాంగ్రెస్‌ పార్టీలో రెండు వర్గాలు సభ్యత్వాల నమోదులోలో పోటాపోటీగా పాల్గొంటున్నాయి. పార్టీ సభ్యత్వం తీసుకుంటే రూ.2లక్షల వరకు ప్రమాద బీమా ఉంది. ఈకార్యక్రమాన్ని ఇరువురు నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పట్టణంతో పాటు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు ముమ్మరంగా కొనసాగుతోంది. రాష్ట్ర అధినాయకత్వం దృష్టిలో పడేందుకు పోటా పోటీగా డిజిటల్‌ సభ్యత్వాలు చేర్పిస్తున్నారు.

Updated Date - 2022-01-25T06:41:56+05:30 IST