Guntur: వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్కపిల్ల మృతి

ABN , First Publish Date - 2022-07-02T15:11:57+05:30 IST

జిల్లాలోని ఏటి అగ్రహారం 11వ లైనులో వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్క పిల్ల మృతి చెందింది.

Guntur: వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్కపిల్ల మృతి

గుంటూరు: జిల్లాలోని ఏటి అగ్రహారం 11వ లైనులో వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్క పిల్ల మృతి చెందింది. గత రాత్రి వీధి కుక్కలు ఇంట్లోకి వచ్చి మరీ పెంపుడు కుక్కపిల్లపై దాడి చేశాయి. దీంతో చనిపోయిన పెంపుడు కుక్క పిల్లతో యజమాని శివారెడ్డి, బంధువులు నిరసనకు దిగారు. వీధి కుక్కల విషయంలో కార్పోరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని కుక్క పిల్ల యజమాని మండిపడ్డారు. మనుషులపై దాడులు చేస్తున్న పట్టించుకోవటం లేదన్నారు. అధికారులు స్పందించే వరకూ ఆందోళన చేస్తామని శివారెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-07-02T15:11:57+05:30 IST