తాగునీటిలో పురుగుల మందు కలుషితం..?

ABN , First Publish Date - 2022-08-17T05:51:57+05:30 IST

మండలంలోని కొండుపల్లెలో మంగళవారం ఉదయం 5 గంటల ప్రాతంలో తాగునీటిలో క్రిమిసంహరక మందు కలుషితం కలకలం రేపింది.

తాగునీటిలో పురుగుల మందు కలుషితం..?

అప్రమత్తమైన గ్రామస్థులు
విచారిస్తున్న పోలీసులు


ఉయ్యాలవాడ, ఆగస్టు 16: మండలంలోని కొండుపల్లెలో మంగళవారం ఉదయం 5 గంటల ప్రాతంలో తాగునీటిలో క్రిమిసంహరక మందు కలుషితం కలకలం రేపింది. ఉదయం ఓహెచ్‌ఎస్సార్‌ ట్యాంక్‌ నుంచి నీళ్లు వదిలారు. దీంతో గ్రామానికి చెందిన రాజు, క్రిష్ణవేణి, నరసమ్మ, ఖాశింబి, రాణి, లక్ష్మీదేవితోపాటు మరి కొందరు తమ ఇళ్ల దగ్గర ఉన్న కొళాయిలతో నీళ్లు పట్టుకోగా మందు వాసన రావటం గమనించారు. అనుమానం వచ్చి గ్రామ పెద్దలకు తెలపడంతో ఆ నీటిని తాగవద్దని చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విచారణ చేపట్టారు. ఎంపీడీవో ఉమామహేశ్వరావును వివరణ కోరగా నీటిని పరీక్షకు పంపినట్లు తెలిపారు.

Updated Date - 2022-08-17T05:51:57+05:30 IST