పెసరపప్పు బూరెలు

ABN , First Publish Date - 2022-01-12T19:21:00+05:30 IST

శనగ పప్పు- అర కప్పు, బెల్లం- కప్పు, పెసర పప్పు- అర కప్పు, బియ్యం- కప్పు, మినప్పప్పు- కప్పు, యాలకుల పొడి- అర స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత

పెసరపప్పు బూరెలు

కావలసిన పదార్థాలు: శనగ పప్పు- అర కప్పు, బెల్లం- కప్పు, పెసర పప్పు- అర కప్పు, బియ్యం- కప్పు, మినప్పప్పు- కప్పు, యాలకుల పొడి- అర స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: బియ్యం, మినపప్పు, పెసరపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఓ పెద్ద పాన్‌లో మినపప్పు, పెసరపప్పును ఉడికించాలి. నీళ్లను తొలగించి మెదపాలి. ఓ పాన్‌లో నీళ్లు పోసి, బెల్లం వేసి పాకం పట్టాలి. యాలకుల పొడి కలపాలి. రెండు నిమిషాల తరవాత ఉడికించిన పప్పులను కూడా చేర్చాలి. నీళ్లంతా ఆవిరయి పప్పంతా దగ్గర చేరినప్పుడు స్టప్‌ కట్టేసి చల్లబడేలా చూడాలి. నానిన బియ్యాన్ని మిక్సీ పట్టి పిండిలా చేసుకోవాలి. దీనికి ఉప్పునూ కలపాలి. ఈ పిండిలో పప్పు ముద్దల్ని అద్ది నూనెలో వేయిస్తే పెసరపప్పు బూరెలు తయారు.

Updated Date - 2022-01-12T19:21:00+05:30 IST