Peru దేశాధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న ఎలిమెంటరీ టీచర్

ABN , First Publish Date - 2021-07-20T18:05:46+05:30 IST

పెరూ దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సామాన్యుడు సత్తాచాటారు. మారుమూల గ్రామంలో సాధారణ ఉపాధ్యయుడిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి.. అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించా

Peru దేశాధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న ఎలిమెంటరీ టీచర్

లీమా: పెరూ దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సామాన్యుడు సత్తాచాటారు. మారుమూల గ్రామంలో సాధారణ ఉపాధ్యయుడిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి.. అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెరూ దేశ అధ్యక్ష పీఠానికి గత నెల 6న ఎన్నికలు జరిగాయి. ఈ హోరాహోరీ పోటీలో గత 25 సంవత్సరాలుగా ఎమిమెంటరీ టీచర్‌గా విధులు నిర్వర్తించిన 51ఏళ్ల పెడ్రో కాస్టిల్లో.. పాపులర్ ఫోర్స్ పార్టీకి చెందిన కైకో ఫుజిమోరిని 44వేల ఓట్ల తేడాతో ఓడించారు. సుదీర్ఘ కౌంటింగ్ అనంతరం ఎన్నికల్లో పెడ్రో కాస్టిల్లో గెలుపొందినట్టు ఆ దేశ ఎలక్షన్ అథారిటీ సోమవారం రోజు అధికారికంగా ప్రకటించింది. 


Updated Date - 2021-07-20T18:05:46+05:30 IST