కోడిగుడ్లతో ఆమ్లెట్ వేస్తుంటే.. ఈ కోడి పిల్ల ఎంత షాకిచ్చింది.. వీడియో వైరల్..

ABN , First Publish Date - 2022-01-02T03:14:39+05:30 IST

ఇటీవల వైరల్ వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. అందులో ఎంత నిజం ఉందో ఏమో గానీ.. చూస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇలా జరగడం సాధ్యమా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా...

కోడిగుడ్లతో ఆమ్లెట్ వేస్తుంటే.. ఈ కోడి పిల్ల ఎంత షాకిచ్చింది.. వీడియో వైరల్..

ఇటీవల వైరల్ వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. అందులో ఎంత నిజం ఉందో ఏమో గానీ.. చూస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇలా జరగడం సాధ్యమా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటి ఆశ్చర్యాన్నే కలిగిస్తోంది. ఓ వ్యక్తి ఆమ్లెట్ వేస్తుండగా అనుకోకుండా ఓ కోడిపిల్ల అతనికి షాక్ ఇచ్చింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది..


ఆమ్లెట్ వేస్తుంటే కోడిపిల్ల షాక్ ఇవ్వడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఓ హోటల్ వ్యక్తి ఆమ్లెట్ వేసేందుకు సిద్ధమవుతాడు. ముందుగా రెండు గుడ్లు తీసుకుని పెనంపై వేస్తాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే తర్వాత పక్కన ఉన్న వ్యక్తి ఇంకో గడ్డు వేయమని అతడికి అందిస్తాడు. దాన్ని తీసుకుని పెనంపై పగులగొట్టగానే.. ఆశ్చర్యంగా అందులోంచి కోడిపిల్ల బయటికి వస్తుంది.

ప్రజలు మద్యం తాగి రావణుడిలా ప్రవర్తిస్తున్నారంటూ.. ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి..


వేడి వేడి పెనంపై కోడిపిల్లను చూడగానే అక్కడున్నవారంతా షాక్ అవుతారు. వెంటనే అతను కోడిపిల్లను తీసుకుని రక్షిస్తాడు. ఈ వీడియోను ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్టు చేశాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. వీడియో మాత్రం వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ప్లాస్టిక్ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. శిశువు ఆరోగ్యంగా ఉన్నా.. పరీక్షించిన వైద్యులు ఏమంటున్నారంటే..



Updated Date - 2022-01-02T03:14:39+05:30 IST