లేబాకు చిన్నరెడ్డయ్య మృతదేహం
చెన్నూరు, జనవరి 21: మండలంలోని శివాలపల్లె వాసి లేబాకు చిన్నరెడ్డయ్య(49) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపిన వివరాల మేరకు... చిన్నరెడ్డయ్య కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ నిమిత్తం అతని భార్య ఇటీవల కువైత్‌కు వెళ్లింది.
దీంతో మనస్తాపానికి గురై గురువా రం రాత్రి విషపు గుళికలు తినగా గమనించిన బంధువులు అతన్ని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొం దుతూ మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు చెన్నూరులోని ఓ సిమెంటు వస్తువుల తయారీలో పని చేస్తున్నాడని అతనికి ఒక కుమారుడు ఉన్నాడన్నారు.