Abn logo
Oct 23 2020 @ 04:32AM

రూ.254 కోట్లతో ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు

మంత్రి పేర్ని నాని


విజయవాడ : జిల్లాలో వ్యవసాయ పంపు సెట్లకు తొమ్మిది గంటల విద్యుత్‌ను అందజేయడానికి రూ.254కోట్లతో కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణంతోపాటు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్టు రవాణశాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. విజయవాడలోని రైతు శిక్షణా కేంద్రంలో వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ నగదు బదిలీ పథకంపై రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ నాటికి పగటిపూటే రైతులకు తొమ్మిది గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామన్నారు. విద్యుత్‌ నగదు బదిలీ ఖాతా కేవలం కంపెనీకి చెల్లింపులు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. నిధులు వ్యవసాయ విద్యుత్‌కు నేరుగా చెల్లించేలా ఈ ఖాతాలు రూపొందించామన్నారు. సీపీడీసీఎల్‌ ఎండీ పద్మజనార్దన్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, ఎమ్మెల్యేలు జోగి రమేష్‌, రక్షణనిధి, సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ జయకుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement