ఎయిడెడ్‌ ఉద్యోగాలిప్పిస్తామంటే నమ్మొద్దు : మంత్రి పేర్ని నాని

ABN , First Publish Date - 2021-07-25T07:14:13+05:30 IST

ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఎరవేసే దళారుల మాటలు నమ్మొద్దని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.

ఎయిడెడ్‌ ఉద్యోగాలిప్పిస్తామంటే నమ్మొద్దు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం టౌన్‌ : ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఎరవేసే దళారుల మాటలు నమ్మొద్దని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.  వివిధ ప్రాంతాల  ప్రజలు తమ సమస్యలను మంత్రి ముందు ఉంచారు. పశ్చిమగోదావరి జిల్లా అకివీడు ప్రాంతా నికి చెందిన కొటికలపూడి లక్ష్మణరావు మంత్రిని కలిశారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఖాళీ పోస్టు కోసం రూ. లక్ష చెల్లించానని చెప్పడంపై మంత్రి పై విధంగా స్పందించారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో రేషనలైజేషన్‌ కార్యక్రమం చేపడుతున్నారని,  మూడేళ్ల ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకుం టున్నారన్నారు. కొన్ని పాఠశాలలను ప్రభుత్వం విలీనం చేసుకునే దిశలో ఉందన్నారు మాచవరం మెట్టు వద్ద దర్గా శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతులు చేయాలని ఆ ప్రాంత ప్రజలు తెలిపారు. పరాసుపేటకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్ధి తనకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదని మంత్రికి తెలియజేశాడు.  

Updated Date - 2021-07-25T07:14:13+05:30 IST