లే-అవుట్‌లకు అనుమతులు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-02-27T06:14:14+05:30 IST

లే-అవుట్‌లకు పంచాయతీ అనుతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఉలవపాడు పంచాయతీ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి బి.విజయమ్మ చెప్పారు.

లే-అవుట్‌లకు అనుమతులు తప్పనిసరి

ఉలవపాడు, ఫిబ్రవరి 26 : లే-అవుట్‌లకు పంచాయతీ అనుతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఉలవపాడు పంచాయతీ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి బి.విజయమ్మ చెప్పారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వెనుక జాతీయ రహదారి పక్కన 118 సర్వే నెంబరులోని 75 సెంట్లులో పంచాయతీ అనుమతులు లేకుండా లే అవుట్‌ వేశారు. కార్యదర్శి ఆదేశాల మేరకు శుక్రవారం పంచాయతీ సిబ్బంది లే-అవుట్‌లోని హద్దురాళ్లను తొలిగించారు. పంచాయతీకి చెల్లించాల్సిన రుసుము చెల్లించిన తరువాతే లే-అవుట్‌ వేసుకోవాలని సూచించారు. పంచాయతీ పరిధిలో గతంలో కానీ నూతనంగా చేపట్టే లేఅవుట్‌లకు తప్పని సరిగా పంచాయతీ అధికారుల అనుమతులు తీసుకోవాలన్నారు. పంచాయతీ అనుమతులేని లే-అవుట్‌లన్నిటికి త్వరలో నోటీసులు పంపిస్తామని ఆమె చెప్పారు.   

Updated Date - 2021-02-27T06:14:14+05:30 IST