పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి

ABN , First Publish Date - 2020-10-01T01:07:28+05:30 IST

కొవిడ్‌-19 నిబంధనలను సమరిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల్లో సందర్శకులను అనుమతించనున్నారు.

పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి

హైదరాబాద్‌: కొవిడ్‌-19 నిబంధనలను సమరిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల్లో సందర్శకులను అనుమతించనున్నారు. పర్యాటక కేంద్రాలలోని బోటింగ్‌, టూరిజం బస్సు సర్వీసులతో పాటు హెరిటేజ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్నపురాతత్వ కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు , కోటలు, మ్యూజియంలు, క్రీడామైదానాలు, క్రీడా ప్రాధికార సంస్థల ఆధ్వర్యంలో ఉన్న క్రీడా వసతులు ఉన్న కేంద్రాలు తెరుచుకోనున్నాయి. కొవిడ్‌-19 పై నిర్ధేశించిన నియమనిబంధనలను పాటిస్తూ పునః ప్రారంభం అవుతుండడం సంతోషంగా ఉందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. 


కొవిడ్‌19 నిబంధనల ప్రకారం పర్యాటక కేంద్రాల వద్ద ధర్మోస్కానర్స్‌,  ద్వారా పర్యాటకుల టెంపరేచర్‌ను తనిఖీ చేసిన తర్వాత అనుమతించనున్నారు. పర్యాటక శాఖ సిబ్బంది తప్పని సరిగా ఫేస్‌ మాస్క్‌తో పాటు చేతికి గ్లౌజ్‌లు ధరించాలని మంత్రి పేర్కొన్నారు. పర్యాటక కేంద్రాలకు వచ్చే సందర్శకులు, పర్యాటకులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మంత్రి సూచించారు. పర్యాట కేంద్రాలకు వచ్చే సందర్శకులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.


ప్రైవేట్‌ ఆధీనంలో ఉన్న క్రీడా సెంటర్లలో కూడా విధిగా ప్రభుత్వం రూపొందించిన కోవిడ్‌నిబంధనలను అమలు చేయాలని అన్నారు. పర్యాటక శాఖ బస్సుసీట్‌లను విధిగా శానిటైజ ర్‌తో శుభ్రం చేయాలని సూచించారు. బస్సు సీట్లలో పర్యాటకులను భౌతిక దూరం పాటించేలా సీట్లు ఏర్పాట్లుచేయాలని టూర్‌ ఆపరేటర్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. 

Updated Date - 2020-10-01T01:07:28+05:30 IST