రైతులకు తప్పనున్న తిప్పలు!

ABN , First Publish Date - 2020-07-16T12:02:34+05:30 IST

జిల్లాలో రైతులకు పంటలను రోడ్లపైన ఆరబోసుకునే తిప్పలు తప్పనున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ఈజీఎస్‌ ద్వారా

రైతులకు తప్పనున్న తిప్పలు!

ఉపాధి హామీ కింద వెయ్యి కల్లాల నిర్మాణం

రైతులకు ఇబ్బందులు తొలగించేందుకు అనుమతి

సబ్సిడీ కింద నిధులను విడుదల చేస్తున్న అధికారులు


నిజామాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  జిల్లాలో రైతులకు పంటలను రోడ్లపైన ఆరబోసుకునే తిప్పలు తప్పనున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ఈజీఎస్‌ ద్వారా కల్లాల నిర్మాణానికి అనుమతి ఇస్తోంది. గ్రామాల వారీగా ఆసక్తి ఉన్న  రైతులకు భూమి అందుబాటులో ఉంటే కల్లాలను మంజూరు చేస్తోంది. వెంటనే నిర్మాణం చేసేందుకు అనుమతులను ఇస్తుం ది. రైతులు పంట కోసిన తర్వాత ఎదుర్కొనే తమ ఇబ్బందులను తొలగించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. నియోజకవర్గాల వారిగా వెయ్యి కల్లాలను నిర్మించాలనే లక్ష్యంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ,  వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రణాళికలను  రూపొందించి అమలు చేస్తున్నా రు.  క్లస్టర్‌ల ద్వారా రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అనుమతుల ను మంజూరు చేస్తున్నారు. జిల్లాలో గడిచిన కొన్నేళ్లుగా పంటల ఉత్ప త్తులు భారీగా వస్తుండడంతో కోసే సమయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఇళ్ల వద్ద, వ్యవసాయ పొలాల వద్ద కల్లాలు లేక రోడ్లపైనే ఆరబోస్తున్నారు. వర్షాలు ఇతర సమస్యలను ఎదుర్కొంటూ పంటలను మార్కెట్‌కు తరలిస్తున్నారు. ప్రతీ సంవత్సరం రెండు పంటలకు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇబ్బందులను తొలగించేందుకు ఈజీఎస్‌ ద్వారా నిధులను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ప్రతీ గ్రామంలో రైతులు కల్లాలను నిర్మించుకునేందుకు అవకాశం ఇస్తోం ది. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం నిధుల ను మంజూరు చేస్తోంది. బీసీ, ఓసీ రైతులకు పది శాతం కంట్రిబ్యూషన్‌ చేసుకుంటే 90 శాతం సబ్సిడీ కింద నిధులను ఈజీఎస్‌ ద్వారా మంజూరు చేస్తున్నారు. పంటలు కోసిన తర్వాత ఆరబోసే సమయంలో వరి, మొక్కజొన్న, సోయా, పసుపు రైతులు ఇబ్బందులను ఎదు ర్కొంటున్నారు.


భారీ వర్షాలు పడితే కుప్పలు పోయడం వల్ల తడిసి వ్యవసాయ ఉత్పత్తు లు దెబ్బతింటున్నాయి. ధాన్యంతో పాటు సోయా, మొ క్కజొన్న మొలకెత్తుతుంది. కల్లాలు ఉంటే ఈ సమస్యలు తప్పడం తో పాటు ఏర్పాట్లు ఉండడం వల్ల వెంటనే కుప్ప పోయడంతో పాటు తడవకుండా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇవ న్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా లో క్లస్టర్‌ల వారీగా ఈ కల్లాల కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ ఏఈవోలు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీరి ద్వారా ఏవోలకు వెళ్లి వారి నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఉపాధి హామీ ఏపీవోలకు వస్తున్నాయి. వాటికి ఏపీవోలు టెక్నికల్‌గా పరిశీలించి అను మతులను ఇస్తున్నారు. మూడు రకాల కల్లాలకు అనుమతులను మంజూ రు చేస్తున్నారు. రైతులు అనుకూలమైన భూమిని చూపెట్టడంతో పాటు ఎంత నిర్మాణం అవసరమో వివరాలను అందిస్తే మంజూరు వెంటనే ఇ స్తున్నారు. జిల్లాలో 50 స్క్వేర్‌  మీటర్‌ కల్లాలకు 56 వేలు, 60 స్క్వేర్‌  మీటర్‌లకు 68 వేలు, 75 స్క్వేర్‌  మీటర్‌లకు 85 వేలుగా నిర్ణయించారు.


ప్రతి నియోజకవర్గం పరిధిలో వెయ్యి కల్లాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలో మొత్తం ఆరు నియోజకవర్గాల పరిధిలో 5500 కల్లాలను ఈ దఫా నిర్మించేందుకు దరఖాస్తులను రైతుల నుంచి దరఖాస్తులను  స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో క్లస్టర్‌ల వారీగా 2778 దరఖాస్తులను స్వీకరించారు. వీటిలో 800 దరఖాస్తులను ఇప్పటికే అను మతి ఇచ్చారు. ఆర్మూర్‌ నియోజకవర్గం పరిధిలో ఎక్కు వ గా దరఖాస్తులు వచ్చాయి. వానాకాలంలో ధాన్యం వచ్చే లోపే వీటి నిర్మాణం పూర్తిచేసి అందుబాటులో ఉంచే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అనుమతించిన వాటికి వెంటనే నిర్మాణం చేసే విధంగా నిధులను మంజూరు చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు వ్యవసాయ శాఖ నుంచి వచ్చే దరఖాస్తులను ప రిశీలించి టెక్నికల్‌ అనుమతులను ఇస్తున్నారు. రెం డు నెలల్లోపు మొత్తం పూర్తయ్యే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడే అవకాశం ఉండడంతో వారిని భాగస్వామ్యులు చేస్తూ నిర్మా ణం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కల్లాలన్ని గ్రామాల పరిధిలో నిర్మాణం అయితే రైతులకు రోడ్లపైన ఆరబోసే ఇబ్బందులు తప్పనున్నాయి. 


రైతుల ఇష్టానికి అనుగణంగానే కల్లాల నిర్మాణం..

జిల్లాలో నియోజకవర్గాల వారీగా లక్ష్యాలను నిర్ణయించి ఈ  కల్లాలకు అనుమతి ఇస్తున్నాం. త్వరగా పూర్తిచేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన మూడు రకాలుగా ఈ కల్లాల నిర్మా ణం చేపడుతున్నాం. రైతుల ఇష్టాలకు అనుగుణంగానే కల్లాలను మంజూరు చేస్తున్నాం.

- రమేష్‌ రాథోడ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి  

Updated Date - 2020-07-16T12:02:34+05:30 IST