పశుగ్రాసం పెంపకానికి అనుమతి

ABN , First Publish Date - 2021-05-11T05:37:13+05:30 IST

జిల్లాలో మూగజీవాల కోసం పశుగ్రాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా 1500 ఎకరాల్లో పశువాసిక పశుగ్రాసం పెంపకం కోసం అనుమతి ఇచ్చినట్లు పశుసంవర్థకశాఖ జేడీ రమణయ్య సోమవారం విలేకరులకు తెలిపారు.

పశుగ్రాసం పెంపకానికి అనుమతి

  1. పశుసంవర్థకశాఖ జేడీ రమణయ్య వెల్లడి 


కర్నూలు(అగ్రికల్చర్‌), మే 10:  జిల్లాలో మూగజీవాల కోసం పశుగ్రాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా 1500 ఎకరాల్లో పశువాసిక పశుగ్రాసం పెంపకం కోసం అనుమతి ఇచ్చినట్లు పశుసంవర్థకశాఖ జేడీ రమణయ్య సోమవారం విలేకరులకు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో రైతులు ఏపీబీఎన్‌, సీవో-1, సీవో-2, సీవో-3 వంటి బహు వాసిక పశుగ్రాసం పెంపకానికి అవసరమైన ప్రోత్సాహకాలను గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు జేడీ రమణయ్య తెలిపారు. 

Updated Date - 2021-05-11T05:37:13+05:30 IST