శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: సింక్రోనీ

ABN , First Publish Date - 2022-07-05T08:17:44+05:30 IST

ఫైనాన్షియల్‌ సేవల కంపెనీ సింక్రోనీ శాశ్వతంగా ఇంటి నుంచి పని చేసుకునే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, డబ్ల్యూఎ్‌ఫహెచ్‌) అవకాశాన్ని ఉద్యోగులందరికీ కల్పించింది.

శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: సింక్రోనీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫైనాన్షియల్‌ సేవల కంపెనీ సింక్రోనీ శాశ్వతంగా ఇంటి నుంచి పని  చేసుకునే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, డబ్ల్యూఎ్‌ఫహెచ్‌) అవకాశాన్ని ఉద్యోగులందరికీ కల్పించింది. ఉద్యోగులకు వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు సింక్రోనీ ఎస్‌వీపీ ఆండీ పొన్నేరి తెలిపారు. దీనివల్ల ఉద్యోగులకు, వారి కుటుంబాలకే కాకుండా కంపెనీకి కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. శాశ్వత డబ్ల్యూఎ్‌ఫహెచ్‌ సదుపాయం వల్ల మరింత మంది నిపుణులను ఆకర్షించడానికి వీలుంటుందని, పని జీవితం మధ్య సమతౌల్యం దెబ్బతినకుండానే ఉద్యోగులు మంచి ఉత్పాదకతను అందించగలరని చెప్పారు. సింక్రోనీకి హైదరాబాద్‌లో కేంద్రం ఉంది. వర్చువల్‌గా ఉద్యోగులతో చర్చలు జరపడానికి హైదరాబాద్‌ వెలుపల ప్రాంతీయ ఎంగేజ్‌మెంట్‌ హబ్‌లను సింక్రోనీ ఏర్పాటు చేస్తోంది. డబ్ల్యూఎ్‌ఫహెచ్‌ను ఎంచుకున్న వారు ఈ కేంద్రాల నుంచి అనుసంధానమయ్యే వీలుంటుంది. 

Updated Date - 2022-07-05T08:17:44+05:30 IST