యూఎన్‌ఎస్‌సీలో భారత్‌కు శాశ్వత హోదా

ABN , First Publish Date - 2022-09-23T07:40:12+05:30 IST

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎ్‌ససీ)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మద్దతు ప్రకటించారు.

యూఎన్‌ఎస్‌సీలో భారత్‌కు శాశ్వత హోదా

జర్మనీ, జపాన్‌లకూ మద్దతు తెలిపిన అమెరికా


వాషింగ్టన్‌, సెప్టెంబరు 22: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎ్‌ససీ)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మద్దతు ప్రకటించారు. భారత్‌తోపాటు జర్మనీ, జపాన్‌లను కూడా శాశ్వత సభ్యదేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు బైడెన్‌ సానుకూలంగా ఉన్నారని వైట్‌హౌస్‌ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో దీనిపై మరింత కసరత్తు చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ‘‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌, జర్మనీ, జపాన్‌ ఉండాలనేది చారిత్రక ఆలోచన. దీనికి మా మద్దతు ఉంటుంది’’ అని ఆ అధికారి చెప్పారు. అంతకుముందు ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) జనరల్‌ అసెంబ్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన జో బైడెన్‌.. భద్రతా మండలిని సంస్కరించే అంశంపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కౌన్సిల్‌లో శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచేందుకు అమెరికా మద్దతునిస్తుందని చెప్పారు.

Updated Date - 2022-09-23T07:40:12+05:30 IST