లోక్‌ అదాలత్‌తో శాశ్వత పరిష్కారం

ABN , First Publish Date - 2022-06-27T05:47:17+05:30 IST

జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా దీర్ఘకాలిక కేసుల కు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వాల్మీకిపురం జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి సీహెచ్‌వీ రామకృష్ణ పేర్కొన్నారు.

లోక్‌ అదాలత్‌తో శాశ్వత పరిష్కారం
వాల్మీకిపురం లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరిస్తున్న జడ్జి రామకృష్ణ

వాల్మీకిపురం, జూన్‌ 26: జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా దీర్ఘకాలిక కేసుల కు శాశ్వత పరిష్కారం లభిస్తుందని  వాల్మీకిపురం జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి సీహెచ్‌వీ రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కోర్టులో మండల న్యాయసే వాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశంతో కక్షలకు పోయి కేసులు పెట్టుకోవడం ద్వారా జీవితాలు దుర్భరం అవు తాయన్నారు. అప్పటికే కేసులతో సతమతమవుతున్న కక్షిదారుల కోసం కోర్టు ఆవరణలో ప్రతిరోజూ ఫ్రీ సిట్టింగ్స్‌ ఏర్పాటు చేయడం జరు గుతోందని, కక్షిదారులు సంప్రదించి వారి కేసులు పరిష్కరించుకోవాల న్నారు. అనంతరం సివిల్‌, క్రిమినల్‌ తదితర వాటికి సంబంధించిమొత్తం 230 కేసులను పరిష్క రించారు. అలాగే పలు బ్యాంకుల రుణాలు తదితర కేసులకు సంబంధిం చి రూ.70,73,218 లక్షలు నగదు రికవరీలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రెడ్డెప్ప, లోక్‌ అదాలత్‌ సభ్యుడు డాక్టర్‌ శ్రీనివాసులు, న్యాయవాదులు, మండల న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. 

లోక్‌ అదాలత్‌లో 36 కేసులు పరిష్కారం 

పీలేరు, జూన్‌ 26: పీలేరులో ఆదివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌ లో 36 కేసులు పరిష్కారమై తద్వారా  రూ.28 లక్షలు కక్షిదారులకు చేరినట్లు కోర్టు వర్గాలవారు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తు లు రాజేశ్వరి, రామకృష్ణ, ఏపీపీ శారద, పీలేరు అర్బన్‌ సీఐ మోహన్‌ రెడ్డి, ఎస్‌ఐలు తిప్పేస్వామి, బాలకృష్ణ, న్యాయవాదులు రఫీ అన్సారీ, షౌకత్‌ అలీ, బి.చంద్రశేఖరరెడ్డి, తెనాలి రామసుబ్రహ్మణ్యం, వగళ్ల మధు, నిరంజన్‌, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు. 

మదనపల్లెలో 499 కేసులు

మదనపల్లె అర్బన్‌, జూన్‌ 26: పట్టణంలోని కోర్టు ఆవరణలో ఆదివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌కు 499 కేసులు వచ్చాయి. ఇందులో సివిల్‌ కేసులు 33, క్రిమినల్‌ కేసులు 450, ఎంవీఓపీ కేసులు 16 పరిష్కారమ య్యాయి. ఇందులో సెకండ్‌ అడిషినల్‌ డిస్త్రిక్ట్‌ జడ్జి పి. భాస్కర్‌రావు, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి డి. వెంకటేశ్వర్లు నాయక్‌, ఫస్ట్‌ అడిషన్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆషీప్‌ సుల్తాన్‌, సెకండ్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రవీణ్‌కుమార్‌, న్యాయసేవాధికార సంస్థ సభ్యులు డి, మురళీ కృష్ణ, పి, సుధాకరర్‌, జె, వసంత కువుమార్‌, ఎ. రామచంద్రన్‌,  కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.  



Updated Date - 2022-06-27T05:47:17+05:30 IST