గ్రామ కంఠ భూసమస్యలకు శాశ్వత పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-20T05:32:08+05:30 IST

గ్రామంలో నెలకొన్న ఇంటి స్థలం, గ్రామ కంఠంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం అంగడికిష్టాపూర్‌ గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు సీఎం ముఖ్యకార్యదర్శి స్మితాసబర్వాల్‌ తెలిపారు. శుక్రవారం మర్కుక్‌ మండల పరిధిలోని అంగడికిష్టాపూర్‌ గ్రామా న్ని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ హన్మంతరావుతో కలిసి ఆమె సందర్శించారు.

గ్రామ కంఠ భూసమస్యలకు శాశ్వత పరిష్కారం



పైలెట్‌ ప్రాజెక్టుగా అంగడికిష్టాపూర్‌

గ్రామంలో పర్యటించిన సీఎం ముఖ్య కార్యదర్శి స్మితాసబర్వాల్‌


జగదేవ్‌పూర్‌, ఆగస్టు 19 : గ్రామంలో నెలకొన్న ఇంటి స్థలం, గ్రామ కంఠంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం అంగడికిష్టాపూర్‌ గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు సీఎం ముఖ్యకార్యదర్శి స్మితాసబర్వాల్‌ తెలిపారు. శుక్రవారం మర్కుక్‌ మండల పరిధిలోని అంగడికిష్టాపూర్‌ గ్రామా న్ని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ హన్మంతరావుతో కలిసి ఆమె సందర్శించారు. గ్రామ కంఠలోని భూ సమస్యపై సర్పంచ్‌ దుద్దెడ లక్ష్మీరాములుగౌడ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగడికిష్టాపూర్‌ గ్రామంలో మొత్తం 31ఎకరాల స్థలం ఉండగా అందులో 21 ఎకరాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలు ఉన్నాయని, పది ఎకరాల్లో ప్రభుత్వ సంస్థలు, రహదారులు ఉన్నాయని వివరించారు. డ్రోన్‌ ద్వారా గ్రామం మొత్తం సర్వే చేసి ముందుగా ప్రభుత్వ స్థలాలను, గ్రామపంచాయతీ పేరున రిజిస్ట్రేషన్‌ చేసి, ఇళ్లను, ఖాళీ స్థలాలను వివాదాలకు తావు లేకుండా యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్మితాసబర్వాల్‌ తెలిపారు. గ్రామంలో సర్వే చేసేటప్పుడు ప్రజలు భూసంబంధిత పత్రాలను అధికారులకు చూపించి సహకరించాలని కోరారు. ఆమె వెంట సిద్దిపేట, మెదక్‌ కలెక్టర్లు ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, హరీశ్‌, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి ఉన్నారు.


Updated Date - 2022-08-20T05:32:08+05:30 IST