శాశ్వత పారిశుధ్య చర్యలు

ABN , First Publish Date - 2022-08-12T03:36:19+05:30 IST

ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అక్షర రూపంలో మేల్కొలుపుతున్న ఆంద్రజ్యోతి వరుస కథనాలపై అధికారులు స్పం దించారు.

శాశ్వత పారిశుధ్య చర్యలు
పబ్లిక్‌ టాయిలెట్స్‌ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

ఆంధ్య్రజ్యోతి వరుస కథనాలపై స్పందించిన అధికారులు

కనిగిరి, ఆగస్టు 11 : ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అక్షర రూపంలో  మేల్కొలుపుతున్న ఆంద్రజ్యోతి వరుస కథనాలపై అధికారులు స్పం దించారు. శాశ్వత పారిశుధ్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించారు. పామూరు బస్టాండు సెంటరు సమీపంలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ వద్ద కంపుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనెల 4న ఆంధ్రజ్యోతిలో ఆ సెంటర్‌ కంపు..కంపు పేరుతో వార్త ప్రచురితమైంది.  ప్రభుత్వాసుపత్రి పోస్టుమార్టం గది వద్ద చెత్త కంపుపై కూడా వార్తలు వచ్చాయి.  దీనిపై మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌ బ్లీచింగ్‌ చల్లించి పారిశుధ్య పనులు చేయించారు.   కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు పామూరు బస్టాండ్‌ సెంటర్‌ వద్ద ఉన్న పబ్లిక్‌ టాయిలెట్‌ వద్ద  చెత్తచెదారాలను తొలగించి మట్టి పోయించారు. ఎవరూ బహి రంగంగా మూత్ర విసర్జనలు చేయకుండా బారికేడ్లను ఏర్పాటు చేయించారు. 

Updated Date - 2022-08-12T03:36:19+05:30 IST