Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెలసరి సరిగా రావడం లేదా..? అయితే దానికి గల కారణాలు.. పరిష్కారాలు తెలుసుకోండి!

ఆంధ్రజ్యోతి(06-01-2022)

ప్రరశ్న: నా వయసు 35 సంవత్సరాలు. నెలసరి సరిగా రావడం లేదు. ఇరెగ్యులర్‌గా ఉంది. దీంతో పాటు ఒక్కోసారి అధిక రక్తస్రావం కలుగుతుంది. పీరియడ్స్‌లో ఈ ఇరెగ్యులర్‌కి కారణాలేంటీ.. వీటికి పరిష్కారాలేంటి?  


డాక్టర్ సమాధానం: నెలసరి సక్రమంగా రాకపోతే... దానికి కారణాలు తెలుసుకోవాలి. ముందుగా ఎందుకు వస్తుంది? వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది? ఆ సమయంలో నొప్పి ఉంటుందా? లేదా? అలాగే రక్తస్రావంలో గడ్డలేమైనా వస్తున్నాయా? అనేది పరిగణలోకి తీసుకోవాలి. ముందుగా మనకి నెలసరి ముట్టు సరిగ్గా అవ్వటానికి మెదడులోంచి సిగ్నల్స్‌ సరిగ్గా అండాశయాలకు వచ్చినప్పుడు అక్కడ హార్మోన్స్‌ సరిగ్గా విడుదలై ఆ ప్రభావం యుట్రెస్‌ మీద పడినప్పుడు నెలసరి ముట్టు సరిగ్గా అవటం జరుగుతుంది.దీన్ని హైపో థెలొమో పిట్యుటరీ ఓవేరియన్‌ యాక్సెస్‌ అంటాం. దీనిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. అంటే సమతుల్యత కోల్పోతే అధిక రక్తస్రావం అవుతుంది. అలాగే థైరాయిడ్‌, ప్రొలాక్టిన్‌ హార్మోన్స్‌ అధికంగా విడుదలైతే ఇలా అవుతుంది. అందుకే హార్మోనల్‌ ఇంబ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవాలి. ఆ తర్వాత లైఫ్‌ స్టయిల్‌ మాడిఫికేషన్స్‌ అంటే ఊబకాయం లాంటివి ఉంటే హార్మోన్‌ ఇంబ్యాలెన్స్‌ జరుగుతుంది. 


ముందుగా భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్‌ దగ్గరకి వెళ్లాలి. అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ చేయిస్తే గర్భాశయంలో లేదా అండాశయంలో కణితలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవచ్చు. ఆ కణితలు ఉంటే ఇలా అధిక రక్తస్రావం జరుగుతుంది. థైరాయిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. ఈ హార్మోన్‌ అవాంతరాల వల్ల వచ్చే అవకాశమెక్కువ. దీన్ని నియంత్రిస్తే రక్తస్రావం రెగ్యులరైజ్‌ అవుతుంది. బ్లడ్‌ పిక్చర్‌ తెలుసుకోవాలి. హిమోగ్లోబిన్‌ ఎంత ఉంది? అనిమియా వచ్చిందా? అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికి అధిక రక్తస్రావం ఎందుకు అవుతుందో ముందు తెలుసుకుంటే సులువుగా ట్రీట్‌మెంట్‌ చేసుకోవచ్చు.


ట్రీట్‌మెంట్‌ విషయానికొస్తే మనం తినే ఆహారంలో కార్బొహైడ్రేట్లు తగ్గించాలి. ప్రొటీన్లు ఎక్కువ తినాలి. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. ఒత్తిడి లేకుండా మెడిటేషన్‌ చేసుకోవచ్చు. డీ స్ర్టెస్సింగ్‌ చేసుకోవాలి. కారణాన్ని బట్టి హార్మోన్ల అసమతుల్యం ఉంటే యాంటీ హార్మోన్స్‌తో కంట్రోల్‌ చేసుకోవచ్చు. కణితులు ఉంటే ల్యాప్రోస్కోపీతో తీయచ్చు. ఇలా చేస్తే మీ సమస్య తీరిపోతుంది. 


- డాక్టర్‌ మంజుల అనగాని

కేర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌

Advertisement
Advertisement