‘సోమశిల’కు పెరిగిన ఇనఫ్లో

ABN , First Publish Date - 2022-10-01T04:50:13+05:30 IST

ఎగువ ప్రాంతాల నుంచి సోమశిల జలాశయానికి వస్తున్న ఇనఫ్లో గణనీయంగా పెరిగింది. కడప, కర్నూలు ప్రాంతాల్లోని పెన్నాబేసినలో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

‘సోమశిల’కు పెరిగిన ఇనఫ్లో
సోమశిలలో రెండు గేట్లు ఎత్తడంతో దిగువకు విడుదలవుతున్న పెన్నమ్మ

రెండు గేట్లు ఎత్తి నీరు విడుదల


అనంతసాగరం, సెప్టెంబరు 30 : ఎగువ ప్రాంతాల నుంచి సోమశిల జలాశయానికి వస్తున్న ఇనఫ్లో గణనీయంగా పెరిగింది. కడప, కర్నూలు ప్రాంతాల్లోని పెన్నాబేసినలో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి ఇనఫ్లో 35 వేల క్యూసెక్కులు ఉండగా, 11, 12వ గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కండలేరు జలాశయానికి 3000 క్యూసెక్కులు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయానికి ప్రవాహం మరింత పెరగవచ్చని అదికారులు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో సోమశిల నుంచి నెల్లూరు వరకు ఉన్న తీరగ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. కాగా, సోమశిలకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో ప్రమాద భరిత ప్రాంతాల్లో సూచికలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆఫ్రానలోని నిషేధిత ప్రాంతాల్లో పర్యాటకులు తిరుగుతున్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. 


వర్షంతో చల్లబడ్డ వాతావరణం


నెల్లూరు(హరనాథపురం) : జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. గురువారం రాత్రి సగటు వర్షపాతం 14.9 మి.మీ, శుక్రవారం 2.4 మి.మీగా నమోదైంది. కాగా, వర్షం కారణంగా ఎర్రమట్టి, బంకమట్టి రోడ్లన్నీ బురద మయంగా మారాయి. అసలే గుంతలమయంగా ఉన్న రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 

Updated Date - 2022-10-01T04:50:13+05:30 IST