మధ్యప్రదేశ్ మంత్రి ఉషాఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-05-12T16:50:09+05:30 IST

కొవిడ్ మహమ్మారికి సంబంధించి మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.....

మధ్యప్రదేశ్ మంత్రి ఉషాఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు

యజ్ఞం చేయండి, కొవిడ్ థర్డ్ వేవ్ భారతదేశాన్ని తాకదు...

ఇండోర్ (మధ్యప్రదేశ్): కొవిడ్ మహమ్మారికి సంబంధించి మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కొవిడ్ మూడో వేవ్ రాకుండా ఉండేందుకు  నాలుగు రోజుల పాటు యజ్ఞం నిర్వహించాలని మంత్రి ఉషా ఠాకూర్ సూచించారు. ఇండోర్ నగరంలో కొవిడ్ కేర్ సెంటరును ప్రారంభించిన మంత్రి ఉషాఠాకూర్ మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ శుద్ధి కోసం నాలుగు రోజులు యజ్ఞం చేయండి. ఇది యజ్ఞ చికిత్స. పూర్వ కాలంలో, మన పూర్వీకులు మహమ్మారిని వదిలించుకోవడానికి యజ్ఞ చికిత్స చేసేవారు. 


ఇది పర్యావరణాన్ని శుద్ధి చేస్తోంది, దీనివల్ల కొవిడ్ మూడో వేవ్ భారతదేశాన్ని తాకదు. ’’ అని మంత్రి ఉషా వ్యాఖ్యానించారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల కేసుల సంఖ్య పెరగడంతో ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలపై అధిక భారం పడుతుంది.కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై దాడి చేయకుండా దీన్ని విజయవంతంగా అధిగమించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేస్తోందని మంత్రి చెప్పారు. మంత్రి ఉషా ఇటీవల ఇండోర్ విమానాశ్రయంలో విగ్రహం ముందు కర్మలు చేశారు.గతంలో మంత్రి కొవిడ్ సంరక్షణ కేంద్రాన్ని సందర్శించినపుడు మాస్కు ధరించలేదని విమర్శలు ఎదుర్కొన్నారు. 

Updated Date - 2021-05-12T16:50:09+05:30 IST