క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి: మెదక్‌ ఎస్పీ

ABN , First Publish Date - 2022-06-24T05:30:00+05:30 IST

పోలీస్‌ సిబ్బంది క్షమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల మెప్పు పొందాలని జిల్లా ఎస్పీ రోహిణీప్రియదర్శిని సూచించారు.

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి: మెదక్‌ ఎస్పీ
వీక్లీపరేడ్‌లో గౌరవవందనం స్వీకరిస్తున్న ఎస్పీ

మెదక్‌ అర్బన్‌, జూన్‌ 24: పోలీస్‌ సిబ్బంది క్షమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల మెప్పు పొందాలని జిల్లా ఎస్పీ రోహిణీప్రియదర్శిని సూచించారు. శుక్రవారం స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో జిల్లాలోని సివిల్‌, ఆర్ముడ్‌ రిజర్వ్‌ పోలీస్‌, హోంగార్డు సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్‌కు ఎస్పీ హాజరై గౌరవ వందనం స్వీకరించారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్‌తో శరీరం దృఢంగా ఉంటుందన్నారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేయాలని, పోలీస్‌ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంచాలన్నారు. కార్యక్రమంలో మెదక్‌, తూప్రాన్‌ డీఎస్పీలు సైదులు, యాదగిరిరెడ్డి, ఏఆర్‌డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐ నాగేశ్వర్‌రావు, సూరపనాయుడు, మెదక్‌, తూప్రాన్‌ సీఐలు మధు, శ్రీధర్‌, గోపీనాఽథ్‌, రవీందర్‌, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ                                 

చిన్నశంకరంపేట, జూన్‌ 24: సీసీ కెమెరాల నిఘాతో నేరాలను నియంత్రిచొచ్చని మెదక్‌ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఖాజాపూర్‌ గ్రామంలోని సర్పంచ్‌ కుంట నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను తూప్రాన్‌ డీఎస్పీ సిద్దిరామ్‌రెడ్డి, సర్పంచ్‌ నాగలక్ష్మితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరిరెడ్డి, సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-24T05:30:00+05:30 IST