Abn logo
Sep 26 2021 @ 00:39AM

అంకితభావంతో విధులు నిర్వహించాలి

కానిస్టేబుల్‌కు నగదు బహుమతి ఇస్తున్న అడిషినల్‌ ఎస్పీ(క్రైమ్‌) లక్ష్మీనారాయణ

అడిషినల్‌ ఎస్పీ (క్రైమ్‌) లక్ష్మీనారాయణ


అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 25: విధుల్లో అంకితభావం అవసరమని అడిషినల్‌ ఎస్పీ (క్రైమ్‌) బి.లక్ష్మీనారాయణ సూచించారు. పోలీసు అతిథిగృహ సమావేశ మందిరంలో పది రోజులుగా సిబ్బందికి సీడీ రైటింగ్‌పై రెండో బ్యాచ్‌కు ఇచ్చిన శిక్షణ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిక్షణలో పొందిన అంశాలపై ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన సిబ్బందికి బహుమతులు అందించినట్టు పట్టణ ఎస్‌ఐ ఎల్‌. రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీ కె.ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ దీనబంధు పాల్గొన్నారు.