బాధ్యతతో విధులు నిర్వహించండి

ABN , First Publish Date - 2020-12-06T05:26:27+05:30 IST

సచివాలయ ఉద్యోగులు బాధ్యతతో విధులు నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసులు అన్నారు. శనివారం చొర్లంగి సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సమయపాలన పాటించాలని, ప్రతిరోజూ బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలన్నారు.

బాధ్యతతో విధులు నిర్వహించండి
అధికారులతో మాట్లాడుతున్న జేసీ

 జేసీ శ్రీనివాసులు

హిరమండలం, నవంబరు 5: సచివాలయ ఉద్యోగులు బాధ్యతతో విధులు నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసులు అన్నారు. శనివారం చొర్లంగి సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సమయపాలన పాటించాలని, ప్రతిరోజూ బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలన్నారు. మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేయని సిబ్బంది వేతనాలు నిలిపివేయాలని ఎంపీడీవో ప్రభావతికి ఆదే శించారు. వలంటీర్లు తమ పరిధిలోని కుటంబాలకు సంబంధించిన పూర్తి  సమాచారం కలిగి ఉండాలని కోరారు. సచివాలయం చుట్టూ ఉపాధి నిధులతో ఎత్తు చేయాలని ఎంపీడీవోకు సూచించారు. అనంతరం తుం గతంపర కాలనీ పాఠశాలలో చేపడుతున్న ‘నాడు-నేడు’ పనులను పరిశీలించారు. అన్ని పనులు ఈనెల 15లోగా పూర్తి చేయాలని ఎంఈవో కె. రాంబాబుకు ఆదేశించారు. తహసీల్దార్‌ సత్యనారాయణ ఉన్నారు.


పనులు వేగవంతం చేయండి

పాతపట్నం: నాడు-నేడు పనులు వేగవంతం చేయాలని జేసీ కె.శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం మూడో సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. స్థానిక మండల పరిషత్‌ ప్రాథమిక ఆదర్శ పాఠశాల,  రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. నిర్దేశిత సమయానికే పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌, ఎంఈ వో కె.రాంబాబు, ఐటీడీఏ ఏఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  

Updated Date - 2020-12-06T05:26:27+05:30 IST