విషం చిమ్మింది ‘పర్ఫెక్ట్‌’ ఒక్కటేనా!

ABN , First Publish Date - 2020-08-12T16:23:53+05:30 IST

మనిషి ప్రాణాలను 24గంటల వ్యవధిలోనే హరించే స్థాయిలో విషం చిమ్మిన..

విషం చిమ్మింది ‘పర్ఫెక్ట్‌’ ఒక్కటేనా!

పెద్దల కంపెనీలన్నింటికీ క్లీన్‌చిట్‌ లభించేనా?

కీలకం కానున్న ల్యాబ్‌ రిపోర్టులు 


ఆంధ్రజ్యోతి, ఒంగోలు: మనిషి ప్రాణాలను 24గంటల వ్యవధిలోనే హరించే స్థాయిలో విషం చిమ్మిన శానిటైజర్ల తయారీ కంపెనీలు ఒకటా? లేక మరికొన్ని ఉన్నాయా?. ఇది యావత్తు ప్రజానీకంలో వ్యక్తమవుతున్న ప్రశ్న. ప్రమాదకర కొవిడ్‌ వైరస్‌ నివారణ  పేరుతో విచ్చలవిడిగా మార్కెట్లోకి వచ్చిన శానిటైజరే చివరకు మం దుబాబుల ప్రాణాలను హరిస్తోంది. అందుకు కురిచేడు ఘటన ఉదాహరణ . ఒకే ఊరులో మూడు రోజుల వ్యవధిలోనే 16మంది మృత్యువాత పడటం అం దుకు కారణం. ఆ తర్వాత దేశంలోను రాష్ట్రంలోను చాలా ప్రాంతాల్లో ఇలాం టి సంఘటనలు చోటుచేసుకున్నా ఈ స్థాయి ప్రాధాన్యం రాలేదు. ప్రభుత్వం కురిచేడు సంఘటనకు ప్రాధాన్యమిచ్చి దర్యాప్తునకు అన్ని విభాగాలను రంగం లోకి దింపింది. పోలీసు శాఖ సిట్‌ ఏర్పాటు చేసి విచారణ పూర్తిచేసింది. 


పలు రకాలు తాగారు

పర్ఫెక్ట్‌ శానిటైజర్‌ కంపెనీ నిర్వాహకుడు లైసెన్సు లేకుండా తయారు చేయటమే మరణాలకు కారణమని సిట్‌ నిర్ధారించారు. దానికితోడు శానిటైజ ర్‌ తయారీలో వినియోగించకూడని ఒక పదార్థాన్ని కలిపారని, ప్రాణాలను హరించటంలో అది కూడా కీలకమైందని కూడా తేల్చారు. అంతవరకు అన్నీ నిజాలే. కానీ కురిచేడులో ఈ ఒక్క శానిటైజర్‌ని మాత్రమే విక్రయించలేదు. మృతులు కూడా ఈ ఒక్క శానిటైజర్‌ మాత్రమే సేవించలేదు. పలురకాల కంపెనీలు తయారుచేసిన శానిటైజర్లు ఆ మెడికల్‌ షాపుల్లో విక్రయించినట్లు తేలింది. సిట్‌ అధికారులు కూడా ఆ మొత్తం శానిటైజర్ల కంపెనీలపై కూడా దాడులు చేశారు. కానీ ప్రస్తుతానికి పర్ఫెక్ట్‌ శానిటైజర్‌ తయారుచేసిన వారిని, దాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టిన వారిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. అందుకు ఆ కంపె నీదారుడికి లైసెన్సు లేకపోవడమే కారణమైంది.


శానిటైజర్‌ తయారీలో మిథనాల్‌ వాడారన్నది మరో అభియోగం. అదంతా నిజమే కావ చ్చు కానీ ఇక్కడ గమనించాల్సిన ముఖ్యవిషయం అదే షాపుల్లో మరికొన్ని రకాల కంపెనీల శానిటైజర్ల విక్రయం కూడా జరిగింది. మృతులు వాటిని కూడా సేవించారు. వివిధరకాల కంపెనీల శానిటైజర్‌ బాటిళ్లు, మృతులు అవి సేవించిన ప్రాంతాల్లో లభ్యమవటం కూడా ఒక నిదర్శనం. 


అవన్నీ పెద్దల కంపెనీలు

కురిచేడు మార్కెట్లో ఇతరత్రా పలు కంపెనీల శానిటైజర్లను కూడా సేవించారని సిట్‌ బృందమే అంగీకరిస్తోంది. అందుకనుగుణంగా ఆయా కం పెనీల తయారీ కేంద్రాల్లో దాడులు కూడా నిర్వహించారు. అలాంటివి హైద రాబాద్‌లో 3, విజయవాడలో 1, తాడేపల్లి, నాదెండ్ల, గుణ దల, జి.కొండూరు ప్రాంతాల్లో ఒక్కొక్క కంపెనీలు కూడా ఉన్నాయి. చివరికి సింగరాయకొండ మండలంలో కూడా ఒక కంపెనీ శానిటైజర్‌ తయారుచేస్తోంది. అయితే ఆ కంపెనీ శానిటైజర్‌ వినియోగించిన దాఖలాలు కురిచేడు మార్కెట్లో కనిపిం చలేదు. ఇక్కడ విషయమేమిటంటే ఈ కంపెనీలన్నింటికీ శానిటైజర్ల తయా రీకి లైసెన్సు ఉంది. పోలీసులు నిందితుడా నిర్ధారించిన పర్ఫెక్ట్‌ కంపెనీకి లైసె న్సు లేదు. అంతేగానీ ఈ కంపెనీల్లో తయారైన శానిటైజర్లు విషం చిమ్మ లేదనటానికి ఆధారాల్లేవు.


పైగా ఈ కంపెనీలన్నీ పెద్దల కంపెనీలు. పలుకు బడి ఉన్నవారు వీటికి యజమానులు. అందుకే వాటి లోతుపాతులను వదిలే శారా అనేది ప్రశ్నార్థకం. పోలీసులు కోల్‌కతాలోని పరీక్షా కేంద్రం(ల్యాబ్‌)కి ఈ అన్ని రకాల శానిటైజర్ల నమూనాలను పంపించారు. ఆ ల్యాబ్‌ ఫలితాలు కీలకం కానున్నాయి. అయితే ఈ తంతులో పెద్దల కంపెనీల విషయంలో లోతుగా దర్యాప్తునకు పోలీసులు లేక ఇతర విభాగాల అధికారులు ధైర్యం చేయలేకపోయారా? లేక పెద్దలే కట్టడి చేశారా? చేతివాటాలే కట్టడి చేశాయా? అన్న విషయంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 


Updated Date - 2020-08-12T16:23:53+05:30 IST