యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-06-22T05:04:20+05:30 IST

యోగా సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి అన్నారు.

యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి

- జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి

- ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం 

- ఆసనాలు వేసిన గురువులు, మహిళలు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జూన్‌ 21 : యోగా సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మహిళా నిత్య యోగా సాధన కేంద్రం ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ రెడ్డి  మాట్లాడుతూ యోగా ప్రక్రియ అనే అద్భుత ఆరోగ్య సాధనను ప్రపంచానికి అందించిన ఘనత మన దేశానిదే అన్నారు. జిల్లా కేంద్రంలో నిత్య మహిళా యోగా సెంటర్‌ ఎంతో విజ యవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మునిసిపల్‌  చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, యోగాసెంటర్‌ నిర్వాహకులు జయమ్మ, శోభావతి యోగా సాధనపై అవగాహన కల్పించారు.  అనంతరం బీజేఎం ఆవాజ్‌ వనపర్తి 90.4 ఎఫ్‌ఎం రేడియో ఆధ్వర్యంలో ఖమర్‌ రెహమాన్‌ కమన్‌ యోగా ట్రైనింగ్‌ సర్టిఫికెట్స్‌ను 120మందికి పంపిణీ చే శారు. కార్యక్రమంలో యోగా సెంటర్‌ సభ్యులు రాధా రెడ్డి, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.  

ఎకో పార్కులో యోగా దినోత్సవం....

జిల్లా కేంద్రంలోని ఎకో పార్కు ఆవరణలో నిత్య యోగా గురువులు ఓంకార్‌, గణేష్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యదర్శి పోచా రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీ య యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా గు రువులను సన్మానించారు. కార్యక్రమంలో నిత్య యోగా సాధకులు సురేష్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, జీజే శ్రీనివాస్‌, హస్రా, పద్మజ, లక్ష్మి పాల్గొన్నారు. 

ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో .. 

వనపర్తి రూరల్‌:  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వ ర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడు భా రత యోగా సాధన సంఘం నిర్వాహకుడు  ఓంకార్‌ పాల్గొని యోగా తరగతులపై పలు సూచనలు చేశా రు. వివిధ రకాల యోగా ఆసనాల గురించి అధ్యాప కులకు తెలిపారు. అనంతరం యో గా శిక్షకుడు శంకర్‌ను ఇన్‌ చార్జి ప్రిన్సిపాల్‌  శ్రీని వాస్‌ సన్మానించారు. కార్యక్రమంలో ప్రో గ్రాం అధికారి ధాంసింగ్‌, అధ్యా పకులు సురేం దర్‌రెడ్డి, రమేష్‌, యాదగిరి, కురు మయ్య, ఉదయ్‌, ఉమా, విజయలక్ష్మి, రామకృష్ణ, మల్లికార్జు న్‌, భాషా  పాల్గొన్నారు. 

ఆత్మకూరులో...

ప్రతీ రోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుం దని మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అశ్వి ని కుమార్‌, బీజేపీ పట్టణ అధ్యక్షు డు విజయ్‌, మండల అధ్యక్షుడు విష్ణు వర్ధన్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యో గా దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వ ర్యంలో  వ్యవసాయ మార్కెట్‌ యార్డులో యోగా దినో త్సవాన్ని నిర్వహించారు.  

పెద్దమందడిలో...

ప్రపంచ యోగా దినోత్సవం మండలం ఘనంగా నిర్వహించారు. మోజర్లలో  బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్‌ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. రోజు యోగా చేయడం వల్ల  ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. యోగా అనేది ప్రాచీన విద్య అన్నారు. కార్యక్రమంలో రాజేష్‌, రవి, రాములు  పాల్గొన్నారు. 

కొత్తకోటలో...

 యోగా దినోత్సవాన్ని మండలంలో ఘనంగా నిర్వహంచారు. పట్టణంలో ఎంపీపీ గుంత మౌనిక, గాడ్‌ఆన్‌ వారియర్స్‌ చోటోఖాన్‌ కరాటే అకాడమీ, కని మెట్టలో కరాటే మాస్టర్‌ పరమేష్‌ ఆధ్వర్యంలో ఉ పాధ్యాయులు, యువకులు, విద్యార్థులు, చిన్నారులు యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మౌనిక మాట్లాడుతూ యోగా ద్వారా ప్రశాంతత, ఆ నందం, అందం, ఆరోగ్యం విజ్ఞానం సాధించొచ్చన్నారు.  కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్‌ జగన్మోహన్‌రెడ్డి , కరాటే మాస్టర్‌ అబ్దుల్‌నబీ పాల్గొన్నారు.

 పెబ్బేరులో..

 పెబ్బేరు మండల కేంద్రంలోని మత్స్య కళా శాలలో సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ కిషన్‌ కు మార్‌ అధ్యక్షతన యోగా దినోత్స వాన్ని నిర్వహించారు. కార్యక్ర మంలో బాలాజీ, ప్రకాష్‌ తదిత రులు పాల్గొని యోగా వల్ల కలి గే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.





Updated Date - 2021-06-22T05:04:20+05:30 IST