CM Stalin ను కలుసుకున్న రాజీవ్ హంతకుడు Perarivalan

ABN , First Publish Date - 2022-05-19T17:45:34+05:30 IST

అనంతరం దీనికి సంబంధించిన వీడియోను స్టాలిన్ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘30 ఏళ్ల జైలు జీవితం గడిపి వచ్చిన నా సోదరుడు పెరరివలన్‌ను కలుసుకున్నాను. సోదరుడు పెరరివలన్, అర్పుతమ్మాళ్‌లు తమ కోసం ఓ ఇంటిని ఏర్పాటు చేసుకుని..

CM Stalin ను కలుసుకున్న రాజీవ్ హంతకుడు Perarivalan

చెన్నై: తమిళనాడు (Tamilandu) ముఖ్యమంత్రి (CN) ఎంకే స్టాలిన్‌ (MK Stalin)ను మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హత్య కేసులో ఏడో నిందితుడైన ఏజీ పెరారివలన్‌ కలుసుకున్నారు. బుధవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 31 ఏళ్ల జైలు జీవితానికి తెరపడింది. జైలు నుంచి విడుదలైన రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకోవడం గమనార్హం. పెరరివలన్‌కు శాలువా కప్పి సీఎం స్టాలిన్ సన్మానించారు.


అనంతరం దీనికి సంబంధించిన వీడియోను స్టాలిన్ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘30 ఏళ్ల జైలు జీవితం గడిపి వచ్చిన నా సోదరుడు పెరరివలన్‌ను కలుసుకున్నాను. సోదరుడు పెరరివలన్, అర్పుతమ్మాళ్‌లు తమ కోసం ఓ ఇంటిని ఏర్పాటు చేసుకుని సంతోషంగా జీవించమని చెప్పాను’’ అని ట్వీట్ చేశారు. స్టాలిన్ షేర్ చేసిన వీడియోలో.. పెరరివలన్‌కు స్టాలిన్ శాలువా కప్పి అభినందించారు. అనంతరం అతడిని ఆత్మీయంగా కౌగిళించుకున్నారు. పెరరివలన్‌తో పాటు అతడి తల్లి, ఇతర కుటుంబీకులు స్టాలిన్‌ను కలవడానికి వచ్చారు.

Updated Date - 2022-05-19T17:45:34+05:30 IST