దళితవాడలో పౌరహక్కుల దినోత్సవం

ABN , First Publish Date - 2021-02-28T07:02:04+05:30 IST

మండలంలోని ఓగూరు ఎస్సీ కాలనీలో పౌరహక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని తహసీల్దార్‌ సీతారామయ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.

దళితవాడలో పౌరహక్కుల దినోత్సవం
వెలిగండ్లలో మాట్లాడుతున్న తహసీల్దార్‌

కందుకూరు, ఫిబ్రవరి 27: మండలంలోని ఓగూరు ఎస్సీ కాలనీలో పౌరహక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని తహసీల్దార్‌ సీతారామయ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమానత్వం, సమసమాజం స్థాపనకై రాజ్యాంగంలో పొందు పరిచిన వివిధ చట్టాలను ఉటంకిస్తూ రాజ్యాంగంలో పౌరహక్కులకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.

వెలిగండ్ల : పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తహశీల్దార్‌ జ్వాలా నరసింహం అన్నారు. శనివారం మండల పరిధిలోని రామలింగాపురంలో పౌర హక్కులపై సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రజలు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. కుల వివక్ష లేకుండా గ్రామంలో సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని తెలిపారు.  కార్య క్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌ రెడ్డి, విఆర్‌ఓ శ్రీను, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T07:02:04+05:30 IST