పోలీసులు అదుపులో ప్రేమజంటను బెదిరించిన వ్యక్తులు

ABN , First Publish Date - 2020-07-06T11:05:50+05:30 IST

జిల్లాకేంద్రంలో ఓ ప్రేమ జంటను బెదిరించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం

పోలీసులు అదుపులో ప్రేమజంటను బెదిరించిన వ్యక్తులు

నల్లగొండ క్రైం, జూలై 5 : జిల్లాకేంద్రంలో ఓ ప్రేమ జంటను బెదిరించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న శివారు ప్రాంతంలోని ఓ గుట్ట వద్దకు ప్రేమ జంట వెళ్లగా గమనించిన ముగ్గురు వ్యక్తులు వారి వద్దకు చేరుకుని కత్తులతో బెదిరించి ఆభరణాలు, నగదు డిమాండ్‌ చేసి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ప్రేమికుడు స్థానిక టూటౌన్‌లో ఫిర్యాదు చేయగా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

Updated Date - 2020-07-06T11:05:50+05:30 IST