చాణక్య నీతి: అలాంటి వారు భూమికి భారం.. వారి సహవాసంతో జీవితం నాశనమే!

ABN , First Publish Date - 2022-06-29T12:42:03+05:30 IST

ఆదర్శవంతమైన జీవితం ఎలా ఉండాలో...

చాణక్య నీతి: అలాంటి వారు భూమికి భారం.. వారి సహవాసంతో జీవితం నాశనమే!

ఆదర్శవంతమైన జీవితం ఎలా ఉండాలో ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు. ఆచార్య చాణక్యుడు అసాధారణ ప్రతిభా సంపన్నుడు. తన తెలివితేటలతో చంద్రగుప్త మౌర్యుని చక్రవర్తిగా చేశాడు. ఈ ప్రపంచానికి భారంగా మారిన వ్యక్తుల గురించి కూడా చాణక్యుడు వివరించాడు. వారితో స్నేహం చేసేవారి జీవితం నాశనమవుతుందని హెచ్చరించాడు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. పూజలు, దానధర్మాలు చేయనివారు

భగవంతుని పూజించని, దానధర్మాలు చేయనివారు భూమికి భారం. మనిషన్నవాడు ఈ జన్మలో, వచ్చే జన్మలో తన జీవితం బాగుండాలని భగవంతుడిని పూజించాలి. పేదలకు దానం చేయాలి. 



2. మంచి ప్రవర్తన లేని వ్యక్తులు

చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తుల కారణంగా అతని కుటుంబ  ప్రతిష్ట దెబ్బతింటుంది. అలాంటి వారు భూమికి భారంగా మారుతారు. మనిషి తన కుటుంబానికి గౌరవం తెచ్చే విధంగా ప్రవర్తించాలి.

3. ఆపదలో ఆదుకోనివారు

ఆపద సమయంలో తమ స్నేహితులకు, కుటుంబానికి సహాయం చేయని వ్యక్తులు భూమికి భారం. ఇలాంటివారికి ఆపదలు ఎదురైనప్పుడు వారిని ఎవరూ ఆదుకోరు. వారు ఎప్పటికీ తమ జీవితంలో ఒంటరిగా పోరాడుతూనే ఉంటారు.

4. జ్ఞానాన్ని గ్రహించనివారు

జ్ఞానాన్ని గ్రహించనివారి జీవితం అర్థరహితం. ఎవరైనా సరే తమ జీవితంలో వీలైనంత అధిక పరిజ్ఞానాన్ని గ్రహించేందుకు ప్రయత్నించాలి. 

Updated Date - 2022-06-29T12:42:03+05:30 IST