Abn logo
Sep 18 2021 @ 20:20PM

నిమజ్జనం నుంచి వస్తున్నారా? ఈ పరీక్ష తప్పదు..

ముంబై: గణపతి ఉత్సవాలను తమ స్వస్థలంలో జరుపుకొని ముంబైకి వచ్చేవారు తప్పకుండా తమ వెంట కరోనా నెగెటివ్ రిపోర్టు తీసుకురావాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ శనివారం ప్రజలను కోరింది. కార్పొరేషన్ 266 ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఆడిషనల్ మున్సిపల్ కమిషనర్ సురేష్ కాకాని చెప్పారు. రాబోయే 15రోజులు కీలకమైనవని అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కరోనా సోకకుండా ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు టీకాలు అందుబాటులో ఉంటాయని ముంబై మేయర్ కిషోరి ఫడ్నేకర్ వెల్లడించారు. టీకాలు తీసుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలన్నారు. ముంబైలో శుక్రవారం 434 కొత్త కేసులు బయటపడ్డాయి. కరోనా సోకినవారి సంఖ్య 7,37,164కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 16,402గా నమోదైంది. ప్రస్తుతం నగరంలో క్రియాశీలక కేసుల సంఖ్య 4,658కు చేరిందని అధికారులు వివరించారు.