ఆకాశంలోంచి పాము కిందకు దూసుకొస్తున్నట్టుగా ఉంది కదూ.. జనాలంతా ఈ అద్భుతాన్ని వీడియోలు తీస్తుండగా..

ABN , First Publish Date - 2021-10-19T23:26:01+05:30 IST

ఓ రోడ్డుపై రాత్రి సమయంలో వాహనలు, పాదచారులతో ట్రాఫిక్ రద్దీగా ఉంది. ఇంతలో ఆకాశంలో ఓ దృశ్యం చూసి అంతా షాక్ అయ్యారు. ఓ భారీ కొండచిలువ ఆకాశంలో మెలికలు తిరుగుతూ ఉంది. చూసినవారంతా దాన్ని సెల్‌ఫోన్లలో బంధిస్తున్నారు. ఈలోగానే

ఆకాశంలోంచి పాము కిందకు దూసుకొస్తున్నట్టుగా ఉంది కదూ.. జనాలంతా ఈ అద్భుతాన్ని వీడియోలు తీస్తుండగా..

వర్షాలు పడ్డప్పుడు ఆకాశం నుంచి చేపలు, కప్పలు తదితరాలు పడుతుంటాయి. కప్పల వాన, చేపల వాన అంటూ ఇటీవల పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. నమ్మశక్యం కాని ఇలాంటి ఘటనలు.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. సుడిగాలుల వల్ల చెరువులు, నదుల్లో ఉండే చేపలు.. నీటితో పాటు పైకెళ్లి ఘనీభవించిన మేఘాల్లో చిక్కుంటాయని, మేఘాలు వర్షించే సమయంలో పైనుంచి నేలపై పడుతుంటాయని తెలిసిందే.. అయితే ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోలో ఓ కొండచిలువ ఆకాశం పైనుంచి పడినట్లుగా ఉంది. అయితే దీని వెనుక ఉన్న కథేంటో చూద్దాం..


ఓ రోడ్డుపై రాత్రి సమయంలో వాహనలు, పాదచారులతో ట్రాఫిక్ రద్దీగా ఉంది. ఇంతలో ఆకాశంలో ఓ దృశ్యం చూసి అంతా షాక్ అయ్యారు. ఓ భారీ కొండచిలువ ఆకాశంలో మెలికలు తిరుగుతూ ఉంది. చూసినవారంతా దాన్ని సెల్‌ఫోన్లలో బంధిస్తున్నారు. ఈలోగానే ఒక్కసారిగా ఆ భారీ సర్పం రోడ్డుపై ఉన్న వాహనాలపై పడింది. కొందరు భయంతో పరుగులు తీశారు. అంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి పామును పట్టుకుని లాగుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే..


ఆకాశం నుంచి పడినట్లుగా కనిపిస్తున్నా.. బాగా గమనిస్తే అసలు విషయం తెలుస్తుంది. ఆ సర్పం అంతవరకూ.. పైన విద్యుత్ వైర్లకు చుట్టుకుని ఉండడాన్ని గుర్తించవచ్చు. కొద్దిసేపు మెలికలు తిరిగిన సర్పం వైర్ల నుంచి విడిపించుకుని ఒక్కసారిగా కిందపడింది. అంతపెద్ద సర్పం.. విచిత్రంగా విద్యుత్ వైర్లకు చుట్టుకుని కిందపడుతుందని ఎవరూ ఊహించలేదు. మనుషులపై పడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

Updated Date - 2021-10-19T23:26:01+05:30 IST