Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 26 2021 @ 14:12PM

కామారెడ్డి జిల్లా: వాగులో చిక్కుకున్న కూలీలు

కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గంతోపాటు మహారాష్ట్ర, కర్నాటకలో భారీగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జుక్కల్ మండలం, హంగార్గా గ్రామ శివారులో ఉన్న వాగుకు భారీగా వరద నీరు రావడంతో వాగు అవతలవైపు పొలం పనులకు వెళ్లిన కూలీలు అక్కడే చిక్కుకున్నారు. అకస్మాత్తుగా వాగుకు భారీగా వరద రావడంతో 8 మంది కూలీలు పంటపొలంలో ఉన్న షెడ్డులో తలదాచుకున్నారు. వరదకు అవతలివైపు ఉన్న ఓ వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తాడు సహయంతో కూలీలను రక్షించారు.

Advertisement
Advertisement