బద్వేలు: రాష్ట్ర ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారని ఎంపీ సీఎం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, పరిపాలన సరిగా లేదని, రైతుల కష్టాలు తీరడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని, నవరత్నాల పేరుతో గారడి చేసి దోపిడీచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, గత రెండు సంవత్సరాలుగా రైతులకు సబ్సిడితో డ్రిప్ ఇరిగేషన్ లేదని, వారికి కావలసిన పనిముట్లను పంపిణీ చేయడం లేదని దుయ్యబట్టారు. లక్షలాది పెన్షన్లు ఇస్తామని హామీలు గుప్పించి అధికారం చేపట్టాక ఉన్న పెన్షన్లను తొలగించడం మోసం చేయడమే రమేష్ తప్పుబట్టారు.