central government Big decision: సీటు బెల్టు పెట్టుకోనందు వల్ల 15,146 మంది మృతి

ABN , First Publish Date - 2022-09-07T15:44:03+05:30 IST

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరగడానికి కార్లలో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్టు(wear seat belts) పెట్టుకోక పోవడమేనని...

central government Big decision: సీటు బెల్టు పెట్టుకోనందు వల్ల 15,146 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరగడానికి కార్లలో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్టు(wear seat belts) పెట్టుకోక పోవడమేనని కేంద్రం రోడ్డు రవాణ విభాగం నిపుణుల సంస్థతో చేసిన ఆడిట్‌లో తేలింది.2020వ సంవత్సరంలో దేశంలో సీటు బెల్టు పెట్టుకోని కారణంగా రోడ్డు ప్రమాదాల్లో 15,146 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై రోడ్డు ప్రమాదాలు జరిగిన బ్లాక్ స్పాట్లను కేంద్ర రవాణశాఖ గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.(central government Big decision) 


కారు ముందు సీటులో కూర్చున్న వారే కాకుండా కారు వెనుక సీటులో(back seat of the car) కూర్చున్న వారు కూడా సీటు బెల్టును తప్పనిసరిగా పెట్టుకోవాలనే నిర్ణయంపై బుధవారం కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంతకం చేశారు. ‘‘ఈ రోజు నేను కార్లలో వెనుక సీట్లకు కూడా సీట్ బెల్ట్ అలారం సిస్టమ్‌లను తప్పనిసరి చేయాలనే ఆర్డర్‌పై సంతకం చేశాను. అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వాహన తయారీదారులు ప్రతి కారులో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలి.


 ప్రస్తుతం అన్ని వాహన తయారీదారులు ముందు సీటు ప్రయాణికులకు మాత్రమే సీట్ బెల్ట్ రిమైండర్‌లను అందించడం తప్పనిసరి. కారులో సీటు బెల్టు పెట్టుకోని వారిని గుర్తించి, ఆటోమేటిక్‌గా ప్రాసిక్యూట్ చేయడానికి మా హైవేలపై అమర్చిన కెమెరాల పరిధిని విస్తరించేందుకు కూడా నేను కృషి చేస్తున్నాను’’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.


Updated Date - 2022-09-07T15:44:03+05:30 IST