వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పాలి

ABN , First Publish Date - 2022-07-02T05:01:28+05:30 IST

ప్రజలపై రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు భారీగా చార్జీలు పెంచి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పాలి
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌ఛార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి

 రెండు నెలల్లో రెండుసార్లు చార్జీల పెంపు దారుణం : టీడీపీ

జమ్మలమడుగు రూరల్‌, జూలై 1: ప్రజలపై రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు భారీగా చార్జీలు పెంచి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని,  వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  సామాన్య ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం చాలా దారుణమన్నారు. డీజిల్‌ సెస్‌ పెరిగిందని చార్జీలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా జగన్‌ ప్రభుత్వం చార్జీలను పెంచి ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. అలాగే నిత్యావసర ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భారాలు మోపడమే ధ్యేయంగా పెట్టుకుందన్నారు.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెంచిన ఆర్టీసీ చార్జీలను తక్షణమే తగ్గించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, సీసాల బాలపుల్లయ్య, కిరణ్‌రాయల్‌, మురళి, జక్కల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. 

ఆర్టీసీ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి

ప్రొద్దుటూరు క్రైం, జూలై 1 : మూడేళ్ల పాలనలో ముచ్చటగా మూడోసారి ఆర్టీసీ చార్జీలను పెంచి జగన్‌ సర్కార్‌ సామాన్యులపై భారం మోపుతోందని, పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో చార్జీలు పెంచకపోయినా బాదుడే బాదుడంటూ దీర్ఘాలు పలికిన జగన్‌మోహన్‌రెడ్డి, తీరా అధికారంలోకి వచ్చాక ఇంటిపన్నులు మొదలు విద్యుత్తు చార్జీలను పెంచడంతో పాటు కొత్తగా చెత్తపన్ను తీసుకొచ్చి ప్రజలపై మోయలేని భారం మోపారన్నారు. మూడేళ్లలో మూడు సార్లు ఆర్టీసీ చార్జీలను పెంచి, రాష్ట్ర ప్రజలపై 3వేల కోట్లు భారం మోపారన్నారు. 151 స్థానాలు గెలిచామన్న బలుపుతో జగన్‌మోహన్‌రెడ్డి ఇష్టానుసారంగా పాలన చేస్తూ పేద , మధ్యతరగతి ప్రజల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారన్నారు. మూడో సారి పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ప్రజలతో కలిసి టీడీపీ పోరాటం చేస్తుందని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2022-07-02T05:01:28+05:30 IST