ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-04-04T09:55:04+05:30 IST

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారితో కలిసి మెలిసి ఉన్నవారు ఎవైరనా ఉంటే స్వచ్ఛందగా

ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి: కలెక్టర్‌

మిర్యాలగూడ/దామరచర్ల, ఏప్రిల్‌ 3: కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారితో కలిసి మెలిసి ఉన్నవారు ఎవైరనా ఉంటే స్వచ్ఛందగా ముందుకు రావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ కోరారు. శుక్రవారం పట్టణంలోని సీతారాంపురం, ఎన్‌ఎస్పీక్యాంపు కాలనీల్లో ఎస్పీ రంగనాథ్‌, ఎమ్మెల్యే భాస్కర్‌రావులతో కలిసి పర్యటించారు.  అనంతరం ముస్లిం మౌలానాలు, ఇమామ్‌లు, మునిసిపల్‌ కౌన్సిలర్లతో ఆర్డీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో ఇప్పటికీ అధికారులు గుర్తించని వారుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైద్య పరీక్షలు చేయించుకోవడంవల్ల, తాము తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు.


ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ పట్టణంలో ఒక వర్గం వారిపై విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. అంద రూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారని, అనుకోకుండా జరిగిన దానికి భయపడాల్సిందేమి లేదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఆర్డీఓ రోహిత్‌సింగ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, టూటౌన్‌ సీఐలు శ్రీనివాసరెడ్డి, సదానాగరాజు, తహసీల్దార్‌ గణేష్‌ పాల్గొన్నారు. కాగా మిర్యాలగూడ పట్టణంలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12వరకే నిత్యావసర వస్తువులు, కూరగాయాల దుకాణాలు తెరిచి ఉంటాయని పట్టణ వన్‌టౌన్‌, టూటౌన్‌ సీఐలు సదా నాగరాజు, దొం తిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం ప్రజలెవ్వరూ బయటికి రావద్దని సూచించారు. దామరచర్ల మండలంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు అవగాహన కల్పించారు.

Updated Date - 2020-04-04T09:55:04+05:30 IST