ఆంక్షలు సడలించారని అజాగ్రత్త వద్దు

ABN , First Publish Date - 2020-06-01T07:37:00+05:30 IST

దేశంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించారన్న ధీమాతో కరోనా మహమ్మారి పట్ల అజాగ్రత్తగా ఉండొద్దని ప్రజలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు...

ఆంక్షలు సడలించారని అజాగ్రత్త వద్దు

  • ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ, మే 31 (ఆంధ్రజ్యోతి): దేశంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించారన్న ధీమాతో కరోనా మహమ్మారి పట్ల అజాగ్రత్తగా ఉండొద్దని ప్రజలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు. మరిం త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేవలం ఆరు వేల కట్టడి ప్రాంతాలకే ఐదవ లాక్‌డౌన్‌ పరిమతమన్నారు. 1 నుంచి అనేక పరిమితుల సడలింపులతో అమలు కానున్న 5.0 లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆదివారం ఫేస్‌బుక్‌ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంతవరకు విధించిన లాక్‌డౌన్‌ కరోనా నియంత్రణకు ఎంతో దోహదపడిందన్నారు. ఇపుడు లాక్‌డౌన్‌ నిర్బంధం నుంచి వెసులుబాటు కలిగినా ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగడం అనివార్యమని అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకున్న జాతీయ నాయకత్వం, ప్రజల డిమాండ్‌ మేరకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు లాక్‌డౌన్‌లో అనేక సడలింపులు ఇచ్చి, ఆర్థిక, సామాజిక కార్యకలాపాల పునఃప్రారంభానికి చర్యలు తీసుకుందని వెంకయ్య తెలిపారు. 


Updated Date - 2020-06-01T07:37:00+05:30 IST