బాధితులకు పరిహారంపై ప్రజలకు అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2022-05-25T06:45:35+05:30 IST

బాధితులకు పరిహారం అందేలా రూపొందించిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాఽథ శర్మ అన్నారు.

బాధితులకు పరిహారంపై ప్రజలకు అవగాహన ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాఽథ శర్మ

జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాఽథ శర్మ

విశాఖపట్నం, మే 24: బాధితులకు పరిహారం అందేలా రూపొందించిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాఽథ శర్మ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టుల ఆవరణలోని గ్రంథాలయంలో  బాధితులకు పరిహారం అనే అంశంపై  ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయ అవగాహనా కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.  క్రిమినల్‌ కేసుల్లో బాధితులకు పరిహారాన్ని అందించేందుకు వివిధ పథకాలు ఉన్నాయని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత న్యాయవ్యవస్థపై ఉందన్నారు. రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్‌. శ్రీదేవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బులికృష్ణ, న్యాయమూర్తులు శ్రీనివాసరావు, గోవర్ధన్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ శైలజ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రవీంద్రప్రసాద్‌, కార్యదర్శి వేణుగోపాల్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఎస్‌.కృష్ణమోహన్‌, ప్యానెల్‌ అడ్వకేట్‌ ఆర్‌.శ్రీనివాసరావు, న్యాయవాదులు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-25T06:45:35+05:30 IST