కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాలి

ABN , First Publish Date - 2021-04-13T05:36:57+05:30 IST

మళ్ళీ విజృంభిస్తున్న కరోనాపై గ్రామాల్లో ప్రజలందరిని అప్రమత్తం చేయడానికి ప్రజాప్రతినిధులంతా సహకరించాలని మంథని సీఐ గట్ల మహేందర్‌రెడ్డి సూచించారు.

కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాలి
మంథనిలో మాట్లాడుతున్న సీఐ మహేందర్‌రెడ్డి

- సీఐ మహేందర్‌రెడ్డి

మంథని, ఏప్రిల్‌ 12: మళ్ళీ విజృంభిస్తున్న కరోనాపై గ్రామాల్లో ప్రజలందరిని అప్రమత్తం చేయడానికి ప్రజాప్రతినిధులంతా సహకరించాలని మంథని సీఐ గట్ల మహేందర్‌రెడ్డి సూచించారు. పోలీసు స్టేషన్‌లో కరోనా వ్యాధి నియంత్రణ చర్యలపై మండలంలోని ప్రజాప్రతినిధులతో సీఐ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలంతా విధిగా మాస్కులు ధరించేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. తరచూ సానిటైజ్‌ చేసుకునేలా, సామాజిక దూరం పాటించాలా చూడాలన్నారు. మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న 38 మందికి రూ. వెయ్యి జరిమానా వేశారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐ ఓంకార్‌యాదవ్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T05:36:57+05:30 IST