సభ్యత్వం ఇస్తున్న ఉమా
కుదప బాదుడే - బాదుడులో మాజీ మంత్రి దేవినేని ఉమా
రెడ్డిగూడెం, మే 18: జగన్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని దానిని ఎవరూ ఆపలేరని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కుదపలో బాదుడే - బాదుడులో ఆయన పాల్గొని మాట్లాడుతూ జగన్ చేసేది ఉత్తుత్తి బటన్ నొక్కుళ్లే అన్నారు. ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేనన్నారు. రాష్ట్రం అప్పులతో సర్వనాశనమైంద న్నారు. కార్యక్రమంలో కె.విజయబాబు, ముప్పిడి నాగేశ్వరరెడ్డి, పైడిమర్ల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉయ్యూరు అంజిరెడ్డి, రాయుడు వెంకటేశ్వరరావు, కోయ చిట్టిబాబు, పాటిబండ్ల సత్యంబాబు, వడత్యా గోపి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
టీడీపీకి అండగా నిలవాలి : ఉమా
గొల్లపూడి : రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీపీకి అండగా నిలవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. గొల్లపూడి పార్టీ కార్యాలయంలో ఐ.టీడీపీ సభ్యులతో కలిసి బుఽధవారం సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వాటాప్స్, టెలిగ్రామ్ ఫార్మాట్లో సభ్యత్వం నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మన టీడీపీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సభ్యత్వం తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నర్రా వాసు, కొమ్మినేని రామారావు, నూతలపాటి వెంకటేశ్వరరావు (నారద), గూడపాటి పద్మశేఖర్, వడ్లమూడి చలపతిరావు, షేక్ కరిముల్లా, ఆలూరి హరికృష్ణ చౌదరి (చిన్న), కోగంటి సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.