Abn logo
Apr 23 2021 @ 01:25AM

టీకా కోసం క్యూకట్టిన జనం

గుంపులుగా ఎగబడుతున్న వైనం

కరోనా నిబంధనలకు తిలోదకాలు


తాడిపత్రి టౌన, ఏప్రిల్‌ 22: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రెం డో డోస్‌ వ్యాక్సిన కోసం గురువారం జనం క్యూకట్టారు. నిబంధనలకు తి లోదకాలిచ్చి గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. కనీసం భౌతికదూరం పా టించేలా చూడాల్సిన వైద్యసిబ్బంది ఏమీపట్టనట్లు వ్యవహరించారు. వ్యా క్సిన కోసం మొదట ఆధార్‌, ఫోననెంబర్లను ఆనలైనలో నమోదు చేసుకోవాలి. ఆతర్వాత వ్యాక్సిన కోసం వెళ్లాల్సి ఉంది. అయితే ఆనలైన కేంద్రం, వ్యాక్సిన గది వద్ద జనం గుంపులుగా ఎగబడ్డారు. ఇలా అయితే కరోనా వ్యాపించదా అంటూ పలువురు చర్చించుకోవడం కనిపించింది.


రాయదుర్గం టౌన : స్థానికులకు కరోనా టీకా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వాస్పత్రిలో 45 యేళ్లు పైబడిన వారికి టీకా వేస్తున్నారు. అయితే స రియైున సదుపాయాలు కల్పించకపోవడంతో టీకా వేయించుకునేందుకు వె ళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆనలైన నమోదులో తీ వ్ర జాప్యం జరుగుతోంది. టీకా కోసం వందల సంఖ్యలో ప్రజలు బారులుతీరారు. కనీసం వారు కూర్చొనేందుకు, విశ్రాంతి కోసం అధికారులు ఎలాం టి చర్యలు తీసుకోలేదు. దీంతో వారి సమస్యలు వర్ణనాతీతంగా మారాయి. 


కొవిడ్‌ నిబంధనలు పాటించాలి : సీఐ

ఉరవకొండ : కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో మసీదుల వద్ద కొవిడ్‌ ని బంధనలు పాటించాలని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్‌ రెడ్డి ముస్లిం మ త పెద్దలకు సూచించారు. స్థానిక పోలీ్‌సస్టేషనలో గురువారం ముస్లిం మ తపెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. మసీదుల్లో నమాజ్‌ చేసేటప్పుడు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. వ్యాక్సినేషనపై అవగాహన కల్పించారు. 


కరోనాను కలిసికట్టుగా ఎదుర్కొందాం : ఎంపీడీఓ

యల్లనూరు : కరోనాను అందరూ కలిసికట్టుగా ఎదుర్కొందామని ఎం పీడీఓ ఓబులమ్మ పేర్కొన్నారు. గురువారం కరోనాపై సర్పంచులు, వార్డుమెంబర్లకు స్థానికంగా అవగాహన కల్పించారు. గ్రామాల్లో రచ్చబండ, ప్ర ధాన వీధుల్లో గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు. కరోనా నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో ఈఓఆర్‌డీ విజయ్‌శేఖర్‌నాయుడు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.


విడపనకల్లు : స్థానిక జడ్పీఉన్నత పాఠశాల ప్రాంగణంలో మండల స ర్పంచలు, వార్డు మెంబర్లకు కరోనా నివారణపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాసులు, ఈఓఆర్డీ చంద్రకమౌళి మాట్లాడు తూ వ్యాక్సినపై అపోహలొద్దన్నారు. 


కుందుర్పి : స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నూతన సర్పంచులు, వార్డు మెంబర్లకు గురువారం కరోనాపై ఎంపీడీఓ నారాయణస్వామి అవగాహన కల్పించారు. కరోనా తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసి, నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు.


కొవిడ్‌ వ్యాక్సినేషనపై శిక్షణ

వజ్రకరూరు : స్థానిక వెలుగు, మండల వ్యవసాయ కార్యాలయాల్లో స ర్పంచలు, వార్డు మెంబర్లు, సచివాలయ ఉద్యోగులకు కొవిడ్‌ వ్యాక్సినేషనపై గురువారం ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఎంపీడీఓ రెహనాబేగం మాట్లాడు తూ గ్రామాల్లో ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సినపై ఉన్న అపోహలు, భయాందోళ న తొలగించాలన్నారు. వ్యాక్సిన వేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది రాద ని, ప్రాణాపాయం ఉండదన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు ఎస్వీ శ్రీనివాసులు, ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి, ఎంఈఓ ఎర్రిస్వామి పాల్గొన్నారు.


గుత్తిరూరల్‌ : స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం కరోనా ని వారణపై ఎంపీడీఓ శ్రీనివాసులు సర్పంచలకు అవగాహన కల్పించారు.   ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ ఖాదర్‌బాషా, ఎంఈఓ రవీనాయక్‌ పాల్గొన్నారు.


బెళుగుప్ప : కరోనా వైరస్‌ ప్రబలకుండా అరికట్టడం మనందరి సమ ష్టి బాధ్యత అని ఈఓఆర్డీ నాగేశ్వరశాస్త్రీ పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయంలో మండలంలోని సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, పంచాయ తీ వార్డు మెంబర్లకు గురువారం కొవిడ్‌ నిబంధనలు, వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాప్‌ద్వారా శిక్షణ ఇచ్చారు.


రాయదుర్గం రూరల్‌ : కరోనా నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాల ని  ఈవోఆర్డీ రఘురామారావు, మాస్టర్‌ ట్రైనర్లు ఇక్బాల్‌, వెంకటరమే్‌షలు పేర్కొన్నారు. గురువారం జిల్లా పరిషత బాలికోన్నత పాఠశాలలో కరోనా నియంత్రణలో భాగంగా ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు.   


తాడిపత్రి టౌన : పట్టణంలో గురువారం 500 మందికి కొవిడ్‌ రెండో డోస్‌ వ్యాక్సిన వేశామని డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు శ్రీనివాసపురం, టైలర్స్‌కాలనీల్లోని ఆరోగ్యకేంద్రాల్లో వ్యా క్సినను ప్రజలకు అందించామన్నారు.


కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం 

గుంతకల్లు టౌన : కరోనా వైరస్‌ కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వి ఫలం చెందాయని వామపక్ష నాయకులు విమర్శించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గురువారం నిరసన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ   ప్రజలకు రక్షణ కల్పించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఆసుపత్రిలో కరోనా బాధితులకు సదుపాయాలు లేవన్నారు. అనంతరం ఆ సుపత్రి వైద్యులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వీరభద్రస్వామి,  ఎస్‌ఎండీ గౌసు,  సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, జగ్గిలి రమేష్‌ పాల్గొన్నారు.


Advertisement