వరుస చోరీలతో జనం బెంబేలు

ABN , First Publish Date - 2022-08-11T05:15:20+05:30 IST

ధర్మవరంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

వరుస చోరీలతో జనం బెంబేలు
సుందరయ్యనగర్‌లోని ఓ ఇంట్లో బీరువాలోని వస్తువులను పడేసిన దొంగలు (ఫైల్‌)


ధర్మవరంలో పోలీసులకు సవాల్‌గా మారిన దొంగలు

ఇళ్లకు తాళం వేస్తే అంతే..

గుడులనూ వదలని వైనం

ధర్మవరం, ఆగస్టు 10: ధర్మవరంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పోలీసులకు దొంగలు స వాల్‌గా మారారు. తాళం వేసిన ఇళ్లతో పాటు దేవాలయాల ను సైతం వదలడం లేదు. నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 10 దొంగతనాలు జరిగాయి. దీంతో పట్టణ వాసులు భయాందోళన చెందుతున్నారు. గత నెలలోనే ఒక ఇంట్లో చోరీ జరుగగా... దేవాలయం, ప్రభుత్వ మద్యం దుకాణంతో పాటు పట్టపగలే స్కూటర్‌ డిక్కీలో ఉన్ననగదు చోరీ అ యింది. సెల్‌ఫోన్ల  దొంగతనాలు చెప్పనక్కర్లేదు. ప్రతి సోమవారం జరిగే వారపు సంతలో సెల్‌ఫోనలు పొగొట్టు కున్నవారు పదులసంఖ్యలో ఉన్నారు. గత నెల 25వ తేదీన సుందరయ్యనగర్‌లో మంజునాథరెడ్డి ఇంటి వద్ద ఎదురుగా ఉన్న ఆయన కిరాణా దుకాణం షెల్టర్‌ను తీయడానికి ప్రయత్నించారు. అది రాకపోవడంతో పక్కనే ఉన్న మంజునాథరెడ్డికి చెందిన మరో పోర్షన తాళాలను పగలకొట్టి... లోపలికి ప్రవేశించి బీరువాలోని రూ.27వేల నగదు, రెండున్నర తులాల బంగారు గొలుసు, ఆరు పట్టుచీరలు, రూ.18వేలు విలువ చేసే సిగరెట్లు బండల్‌, ఆయిల్‌ బాక్స్‌ తదితర వస్తువులను ఎత్తుకెళ్లారు. అదే రోజే నేసేపేటలోని పుట్లమ్మదేవాలయంలోనూ చోరీకి ప్రయత్నించారు. గత నెల 27వతేదీన అర్ధరాత్రి పట్టణంలోని  మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ మధ్యం దుకాణంలో దొంగలు చొరబడి సీసీకెమరా వైర్లను తొలగించి రూ.30,600 విలువ చేసే మద్యం బాటిళ్ల బాక్స్‌ను చోరీ చేశారు. అలాగే 30వతేదీన పట్టణంలో పట్టపగలే దొంగలు హల్‌హల్‌ చేశారు. చెన్నేకొత్తపల్లికి చెందిన మహమ్మద్‌రియాజ్‌ బ్యాంకు లో రూ.1.90లక్ష నగదు డ్రా చేసుకుని స్కూటీ డిక్కీలో ఉంచి...  ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని ఓ కిరాణాదుకాణంలోకి వెళ్లాడు. గుర్తుతెలి యని ఇద్దరు దొంగలు ఆ డబ్బును చోరీ చేశారు. ఇవన్నీ మరువనే ఈనెల 4వ తేదీన సుందరయ్య నగర్‌లో గుర్తు తెలియని దుండగులు ఓ ఇంటి తలుపులను కాల్చివేసి లోపలికి ప్రవేశించారు.  టీవీ వద్ద ఉన్న చిన్న పర్సులోని రూ.600నగదు, కూలర్‌, రెండు ఏటీఎం కార్డులు,రూ.3వేలు విలువ చేసే ప్లాస్టిక్‌ వస్తువులు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా తాజాగా సత్యసాయినగర్‌ లోని పెద్దమ్మగుడిలోకి  గుర్తుతెలియని దొంగలు సోమవారం రాత్రి  చొరబడి హుండీని పగలకొట్టి రూ.30వేలు  చోరీ చేశారు.  పట్టణంలో నిఘా పెట్టాల్సిన బ్లూకోల్ట్స్‌ పోలీసులు  కేవలం ప్రధాన రహదారుల వెంబడి ద్విచక్రవాహనంలో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా  పట్టణంలో క్రైం రేటు తగ్గించేందుకు ఆయావార్డుల్లో  ప్రత్యేక నిఘా ఉంచేలా వార్డుల వారీగా పోలీసు కానిస్టే బుళ్లను ఇనచార్జ్‌లుగా నియమించారు. కానీ వారు కేవలం టీస్టాళ్లు, ప్రధానరహదారుల్లో తిరగడమే తప్ప ఆయా వార్డుల్లో తిరిగి  నిఘాపెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అర్బన పోలీస్‌స్టేషనలో కేవలం పంచాయతీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు  పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పట్టణంలో జరుగుతున్న చోరీలకు ఉన్నతాధికారులు అడ్డుకట్టవేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

 నిఘా పెంచుతాం..- రమాకాంత, డీఎస్పీ, ఽధర్మవరం

పట్టణంలో జరుగుతున్న దొంగతనాలపై మరింత నిఘా పెంచుతాం. రాత్రి సమయాల్లో సిబ్బందిని పెంచి వార్డుల్లో ప్రత్యేక నిఘా ఉం చుతాం. ఈ మేరకు దొంగతనాలకు చెక్‌ పెడ తాం. ఇప్పటికే సిబ్బందిని అప్రమత్తంచేశాం.


Updated Date - 2022-08-11T05:15:20+05:30 IST