AP News: ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలి: టీడీపీ

ABN , First Publish Date - 2022-08-13T22:16:55+05:30 IST

Eluru: ఎగువన కురిసిన భారీ వర్షాలకు వేలేరుపాడు (Velerupadu) మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నెల రోజుల వ్యవధిలో గోదావరి జలాలు (Godavari flood water)

AP News: ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలి: టీడీపీ

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా) : ఎగువన కురిసిన భారీ వర్షాలకు వేలేరుపాడు (Velerupadu) మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నెల రోజుల వ్యవధిలో గోదావరి జలాలు (Godavari flood water) గ్రామాల్లోకి చేరడం ఇది రెండో సారి. వేలేరుపాడు మండలంలో నీట మునిగిన ప్రాంతాలను టీడీపీ (TDP) నాయకుడు బొరగం శ్రీనివాసులు పరిశీలించారు. ముంపు బాధితులతో మాట్లాడారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం బొరగం శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ .. గోదావరి వరద జలాలతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  తాడేపల్లిలో నిద్రపోతున్నాడని విమర్శించారు.  అధికార యంత్రాంగం కూడా మొద్దునిద్రలో ఉందన్నారు. నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించి పునరావాస కాలనీలకు తరలించాలని డిమాండ్ చేశారు.  శ్రీనివాసులు వెంట టీడీపీ  మండల అధ్యక్షుడు అమరవరపు అశోక్, ప్రధాన కార్యదర్శి కట్టం రాంబాబు, మాజీ జడ్పీటీసీ శాకమూరి సంజీవులు, సుధాకర్, కె రాంబాబు, పోసి, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం అధ్యక్షుడు బోలగాని అఖిల్ సాయి తదితరులు ఉన్నారు.





Updated Date - 2022-08-13T22:16:55+05:30 IST