ప్రకాశం: జిల్లాలోని దాదాపు 15 గ్రామాల ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. చినగంజాం మండలం సోపిరాల దగ్గర విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. రైల్వే గేట్ దగ్గర పట్టాల కింద ఉన్న 33 కేవీ విద్యుత్ అండర్ కేబుల్ దగ్గర అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 20 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో 15 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.