యోగిని కాదు, యోగ్య ప్రభుత్వాన్ని కోరుతున్నారు..

ABN , First Publish Date - 2021-12-11T22:37:29+05:30 IST

ఉత్తరప్రదేశ్ ప్రజలు యోగి ప్రభుత్వాన్ని కోరడం లేదని, యోగ్యమైన ప్రభుత్వాన్ని...

యోగిని కాదు, యోగ్య ప్రభుత్వాన్ని కోరుతున్నారు..

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రజలు యోగి ప్రభుత్వాన్ని కోరడం లేదని, యోగ్యమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ ప్రారంభిస్తున్న మెజారిటీ ప్రాజెక్టులన్నీ సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినవేనని పేర్కొన్నారు. శనివారంనాడు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గోర‌ఖ్‌పూర్ ఎయిమ్స్‌ కోసం భూమిని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం కేటాయించకుండా ఉంటే ఇప్పటికే అది సాకారమయ్యేది కాదని అన్నారు. పేదలకు లోహియా ఆవాస్‌ను ఎస్‌పీ అందజేస్తే, బీజేపీ రైతులపై వాహనాలు నడిపించిందని, లఖింపూర్ ఖేరిలో రైతులను పొట్టనపెట్టుకుందని విమర్శలు గుప్పించారు. తమ పార్టీ అభివృద్ధిని కోరుకుంటుటే, పేర్లు మార్చడం మినహా బీజేపీ చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. యూపీలో యువతకు ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? రైతుల ఆదాయం ఎక్కడ రెట్టింపు అయింది? కేవలం భారీ హోర్డింగ్‌లతో ప్రాజెక్టుల కంటే ప్రచారానికే ఎ్కకువ సొమ్ము ఖర్చుచేస్తూ పోతున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని అఖిలేష్ విమర్శించారు.

Updated Date - 2021-12-11T22:37:29+05:30 IST