ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-07-24T06:11:45+05:30 IST

జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాదులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వెద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు అన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌రావు

సిరిసిల్ల టౌన్‌, జూలై 23: జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాదులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వెద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో  మాట్లాడారు.  ప్రతీరోజు రక్షిత మంచినీటిని తాగాలని, అవసరమైతే  కాచి చల్లార్చిన నీటిని తాగాలని అన్నారు. వేడిగా ఉండే  ఆహార పదార్థాలను తినాలన్నారు. వ్యక్తి గత పరిశుభ్రతపై అవగాహ పెంచుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిలవలు లేకుండా చూసుకోవాలని అన్నారు. లేని పక్షంలో నిలవ ఉన్న నీటిలో దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. కొవిడ్‌ 19 వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించాలని అన్నారు.  థర్డ్‌వే వచ్చే అవకాశాలు ఉన్నందున్న జిల్లాలో ఆరోగ్య కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. 

దరఖాస్తుల ఆహ్వానం 

దోమల లార్వాను(బ్రీడింగ్‌ చెక్కర్స్‌) తొలగించడానికి ఐదు నెలల పాటు పనిచేయడానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెద్య, ఆరోగ్యశాక అధికారి డాక్టర్‌  సుమన్‌ మోహన్‌రావు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక్కో మండలానికి ఒక్కరిని ఐదు నెలల పాటు పని చేయడానికి నియమిం చనున్నట్లు తెలిపారు.    ఆయా మండాలాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 26న ఉదయం 11 గంటలకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సర్టిఫిక్టెలతో హాజరుకావాలని తెలిపారు.

Updated Date - 2021-07-24T06:11:45+05:30 IST