సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-11-28T04:20:44+05:30 IST

సైబర్‌ నేరాలపై ప్రజ లకు అవగాహన కల్పించాలని ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర అన్నారు. శనివారం పోలీసుహెడ్‌క్వార్టర్స్‌లో నేరసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నేర పరిశోధనలో సిబ్బంది పనితీరు, వారికి కావాల్సిన సలహాలు, సూచనలు, లైన్‌ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌, మెలకు వలు తెలియజేశారు. ఆధునిక టెక్నాలజీని మరింతగా ఉపయోగించాలని అన్నారు.

సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
పోలీసు అధికారులను సన్మానిస్తున్న ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర

- ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర

ఆసిఫాబాద్‌, నవంబరు 27: సైబర్‌ నేరాలపై ప్రజ లకు అవగాహన కల్పించాలని ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర అన్నారు. శనివారం పోలీసుహెడ్‌క్వార్టర్స్‌లో నేరసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నేర పరిశోధనలో సిబ్బంది పనితీరు, వారికి కావాల్సిన సలహాలు, సూచనలు, లైన్‌ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌, మెలకు వలు తెలియజేశారు. ఆధునిక టెక్నాలజీని మరింతగా ఉపయోగించాలని అన్నారు. అనంతరం ఆసిఫాబాద్‌ అడిషనల్‌ పీపీఆర్‌ శ్యాంరావు, సీడీపీవో రవీందర్‌, చరణ్‌సింగ్‌, ఉమేష్‌లను ఎస్పీ పుష్పగుచ్ఛాలు, శాలు వాలతో సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఏఆర్‌ సురేష్‌కుమార్‌, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ డీఎస్పీలు కరుణాకర్‌, శ్రీనివాస్‌, జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T04:20:44+05:30 IST